అమరావతి: పీఆర్సీ అమలుకు ప్రభుత్వం జారీ చేసిన జీవోలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై ఏపీ హైకోర్టు విచారణ జరిపింది.
ఈ మేరకు ప్రభుత్వ తరపు న్యాయవాది శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. ఈ పిటిషన్ డివిజన్ బెంచ్ ముందు విచారించాలని, ఇది సింగిల్ బెంచ్ కాబట్టి ను ఇక్కడ విచారించకూడదని అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ హైకోర్టుకు తెలిపారు. శ్రీరామ్ వాదనతో ఏకీభవించిన ధర్మాసనం రిట్ పిటిషన్ను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తదుపరి చర్యలు తీసుకోవడానికి పంపాలని రిజిస్టర్ను ఆదేశించింది.
అదే విధంగా అభివృద్ధి వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు, అమరావతి పిటిషన్లపై ఏపీ హైకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. పిటిషనర్ల తరపు వాదనలు ముగిసిన అనంతరం ఫిబ్రవరి 2న ప్రభుత్వం, సీఆర్డీఏ తరపున వాదనలు వినిపించాలని ధర్మాసనం పేర్కొంది. తదుపరి విచారణ ఫిబ్రవరి2కు వాయిదా వేసింది.
కృష్ణయ్య గారి వాయిస్...
పిఆర్సి జీవోలను సవాల్ చేస్తూ వేసిన పిటిషన్ ఈరోజు విచారణకు వచ్చినది. ఇరువైపుల వాదనలు విన్న తర్వాత....పిఆర్సి జీవోలను లను రద్దు పర్చాలని పిటిషనర్ అడగడం వల్ల, తద్వారా ఈ రిట్ పిటీషన్ రాజ్యాంగం లోని 309 అధికరణ క్రింద జారీ చేయబడిన నోటిఫికేషన్ ను ప్రశ్నిస్తూ దాఖలైనందున హైకోర్టు వారి రూల్ 14(vi) ప్రకారం అది డివిజన్ బెంచ్ వద్దనే రావలసి ఉన్నందున సింగిల్ జడ్జి వినటం కుదరదని,తగిన బెంచికి పంప వలసిందిగా రిజిస్ట్రీ ను ఆదేశిస్తూ, కావల్సిన ఉత్తర్వులు గౌరవ ప్రధాన న్యాయమూర్తి ద్వారా పొంద వలసిందిగా గౌరవ జస్టిస్ సత్యనారాయణ మూర్తి గారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది.
జీతాలకు సంబంధించిన ప్రతిష్టంభన కొనసాగుతున్న దృష్ట్యా అత్యవసర ఉత్తర్వులు ఇవ్వమని పిటిషనర్ తరపు న్యాయవాది కోరడం జరిగింది. సోమవారం రోజున స్పెషల్ మెన్షన్ చేసేందుకు ప్రయత్నిస్తామని పిటిషనర్ తరఫు న్యాయవాది చెప్పడం జరిగింది. పిటిషనర్ అయిన ఆంధ్రప్రదేశ్ గెజిటెడ్ అధికారుల జేఏసీ అధ్యక్షులు కృష్ణయ్య మాట్లాడుతూ నేడు ప్రభుత్వంతో చర్చలకు వెళ్లలేదని...ఒకవేళ వెళ్లాల్సివస్తే, పిఆర్సి జీవోలను తాత్కాలికంగానైనా నిలుపుదల చేయాలని... అప్పుడే ఉద్యోగులలో నమ్మకం కలుగుతుందని... తద్వారా మాత్రమే చర్చలు ఫలప్రదం అయ్యే అవకాశం ఉందని ఈ సందర్భంగా వివరించారు.
- కేవీ.కృష్ణయ్య., అధ్యక్షులు@ఆంధ్రప్రదేశ్ కేసరి అధికారుల జే.ఏ.సి.
0 Comments:
Post a Comment