✍మధ్యాహ్న భోజనానికి బదులు ఇడ్లీ, సాంబారు
గురువారం మెనూలో మార్పు
🌻తాడేపల్లి, న్యూస్టుడే : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్ధులకు మద్యాహ్నభోజన పథకం మెనూలో విద్యాశాఖ మార్పులకు ప్రయత్నిస్తోంది. వారంలో గురువారం ఇడ్లీ, సాంబారు ఇవ్వాలని సంకల్పించింది. రాష్ట్రంలో గుంటూరు జిల్లా తాడేపల్లి మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది. మండలంలోని చిర్రావూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో నూతన మెనూ ప్రకారం గురువారం మధ్యాహ్నం ఇడ్లీ, సాంబారు వడ్డించారు. మండలంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల విద్యార్థులకు ఒక్కొక్కరికి నాలుగు ఇడ్లీలు, ఉన్నత పాఠశాలల విద్యార్థులకు 5 ఇడ్లీలు ఇవ్వనున్నట్లు మధ్యాహ్న భోజన పథకం జిల్లా అసిస్టెంట్ డైరె క్టర్ శ్రీనివాసరావు చెప్పారు. పాత మెనూ ప్రకారం ప్రతి గురువారం కిచిడీ, టమాట చట్నీ, ఉడికించిన గుడ్డు అందజేసేవారు.
0 Comments:
Post a Comment