Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

MORE TO VIEW

Wednesday, 12 January 2022

Jagananna Smart Towns | లాభాపేక్ష లేకుండా ఎంఐజీ లేఅవుట్లు

 Jagananna Smart Towns | లాభాపేక్ష లేకుండా ఎంఐజీ లేఅవుట్లు

Jagananna Smart Towns | లాభాపేక్ష లేకుండా ఎంఐజీ లేఅవుట్లు 
*మార్కెట్‌ ధర కంటే తక్కువకే మధ్యతరగతికి ప్లాట్లు

*150, 200, 240 గజాల చొప్పున ఇస్తాం

*4 విడతల్లో చెల్లింపులకు వీలు: జగన్‌

*జగనన్న టౌన్‌షిప్‌ వెబ్‌సైట్‌కు శ్రీకారం

 రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు మోసాలు చేయకుండా ఉండేలా.. లాభాపేక్ష లేకుండా ప్రభుత్వం ఎంఐజీ లేఅవుట్లు వేస్తోందని సీఎం జగన్‌ అన్నారు. మధ్య తరగతివారికి సొంతింటి కలను సాకారం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. దానిలో భాగంగానే వివాదాలు లేని ప్లాట్లను మార్కెట్‌ ధర కంటే తక్కువకే మధ్య తరగతి ప్రజలకు అందిస్తామని తెలిపారు. మంగళవారమిక్కడ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జగనన్న స్మార్ట్‌ టౌన్‌షి్‌ప వెబ్‌సైట్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతి పేదవాడికీ ఇల్లుండాలన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 31లక్షల ఇళ్ల పట్టాలను పంపిణీ చేశామని చెప్పారు. మొదటిదశలో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమై పనులు జరుగుతున్నాయన్నారు. ఎంఐజీల్లో అన్ని సౌకర్యాలతో ప్లాట్లు అందించేలా ఈ రోజు నుంచి శ్రీకారం చుడుతున్నామని తెలిపారు. మూడు కేటగిరీల్లో స్థలాలు పంపిణీ చేస్తామని.. ఎంఐజీ-1లో 150 గజాలు, ఎంఐజీ-2లో 200 గజాలు, ఎంఐజీ-3లో 240 గజాలు అందిస్తామని చెప్పారు. తొలి దశలో అనంతపురం జిల్లా ధర్మవరం, గుంటూరు జిల్లా మంగళగిరి పరిధిలోని నవులూరు, కడప జిల్లా రాయచోటి, ప్రకాశంజిల్లా కందుకూరు, నెల్లూరు జిల్లా కావలి, పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో అమలు చేస్తామన్నారు. మంగళవారం నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. రాబోయే రోజుల్లో ప్రతి నియోజకవర్గానికి ఈ పథకాన్ని విస్తరిస్తామని, ప్రజలు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని వివరించారు. 

18 లక్షల వరకు..18లక్షల వరకు వార్షికాదాయం ఉన్నవారు ప్లాట్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని సీఎం తెలిపారు. ఏడాదిలో 4విడతల్లో ప్లాట్‌ కోసం డబ్బు చెల్లించే అవకాశముంటుందన్నారు. దరఖాస్తు సమయంలో 10శాతం, నెలలోపు 30శాతం, ఆరు నెలల్లోపు మరో 30శాతం, రిజిస్ట్రేషన్‌లోపు మిగిలిన 30శాతం చెల్లించవచ్చన్నారు. చెల్లింపులు పూర్తయిన వెంటనే అభివృద్ధి చేసిన ప్లాట్‌ను లబ్ధిదారుకు అందజేస్తామని చెప్పారు. ముందుగానే పూర్తిమొత్తం చెల్లించిన వారికి 5శాతం రాయితీ ఇస్తామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఎంఐజీలో 10శాతం ప్లాట్లను 20శాతం రిబేటుతో కేటాయిస్తామని చెప్పారు.  పూర్తి పారదర్శకతతో ఆన్‌లైన్‌ ద్వారానే ప్లాట్లు కేటాయిస్తామన్నారు. ప్రతి నియోజకవర్గానికి ఒక టౌన్‌షి్‌ప ఉండాలని సీఎం ఆదేశించారని, ఆ మేరకు జిల్లా కలెక్టర్లకు, మున్సిపల్‌ శాఖ అధికారులకు ఆదేశాలిచ్చామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పలువురు ఈ కార్యక్రమం గురించి తమ అభిప్రాయాలను తెలియజేశారు.


1 comment:

  1. Please allot a plot to old house owner, because they have no such facilities in their old house and they have no facilities like 40feet roads, drinking water underground drainage etc.And also allot a plot for wife and husband,both are employees because they may earn above Rs1800000/-pa.because,they also do not have such facilities in present areas which are providing in MIG Plots.

    ReplyDelete

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Technology

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top