Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

MORE TO VIEW

Wednesday, 19 January 2022

IT Act 80C | రూ.2.5 లక్షలకు 80సీ కింద పన్ను ఆదా లిమిట్.. ఎందుకంటే?!

 IT Act 80C | రూ.2.5 లక్షలకు 80సీ కింద పన్ను ఆదా లిమిట్.. ఎందుకంటే?!


IT Act 80C | వచ్చే ఆర్థిక సంవత్సర (2022-23) బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధం అవుతున్నాయి. వచ్చేనెల ఒకటో తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌కు బడ్జెట్ ప్రతిపాదనలు సమర్పించనున్నారు.

అయితే, ప్రతి బడ్జెడ్‌లో మాదిరిగానే ఈసారి కూడా వేతన జీవులు పన్ను మినహాయింపుల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇంతకుముందు పన్ను చెల్లింపు దారులకు ఆదా మార్గం.. ఆదాయం పన్ను చట్టంలోని 80సీ సెక్షన్ ఉండేది. 2013-14 వరకు ప్రతియేటా గరిష్ఠంగా రూ.లక్ష వరకు మాత్రమే. 2014-15లో దాని పరిమితి రూ.1.5 లక్షలకు పెంచేశారు. నాటి నుంచి ఏడేండ్లుగా ఇదే పరిమితి కొనసాగుతున్నది. వచ్చే బడ్జెట్ ప్రతిపాదనల్లోనైనా దీన్ని రూ.2.5 లక్షలకు పెంచాలన్న అభ్యర్థనలు వినిపిస్తున్నాయి.


భారీగా పెరిగిన ఖర్చులు.. ధరలు


2014-15 నుంచి పలు ఖర్చులు పెరిగాయి.. వేతన జీవుల వేతనాలు.. అలవెన్స్‌లు పెరిగాయి. వాటితోపాటు నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగాయి. కానీ ఇన్‌కం టాక్స్ యాక్ట్‌లో 80సీ సెక్షన్ కింద బెనిఫిట్ మాత్రం పెంచలేదు. ఈ నేపథ్యంలో 80సీ సెక్షన్ కింద ఆదా పరిమితులు పెంచాలని ప్రతియేటా పలు వర్గాలు ప్రభుత్వాన్ని.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను అభ్యర్థిస్తూనే ఉన్నాయి కూడా..


కోవిడ్‌-19.. ద్రవ్యోల్బణం ఎఫెక్ట్ ఇలా


ప్రస్తుతం కోవిడ్‌-19 మహమ్మారి ఎఫెక్ట్‌, దాని ప్రభావంతో పెరిగిన ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుని 80సీ సెక్షన్ కింద ఏటా పన్ను మినహాయింపు పరిమితిని రూ.2.5 లక్షలకు పెంచాలన్న డిమాండ్ వస్తున్నది. ఇది కేవలం సగటు పన్ను చెల్లింపుదారుడిపై భారాన్ని తగ్గించడమే కాదు.. ప్రభుత్వానికి సాయ పడుతుంది కూడా.


80సీ సెక్షన్ కింద బెనిఫిట్స్ ఏమిటంటే.


వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు (హెచ్‌యూఎఫ్‌) మాత్రమే 80సీ కింద పన్ను మినహాయింపు కోరేవి. పన్ను ఆదాకు అత్యంత ప్రజాదరణ పొందిన సెక్షన్ ఇది.

*వ్యక్తులు కొన్ని పొదుపు పథకాల కింద ఇన్వెస్ట్‌మెంట్లు, కొన్ని ప్రత్యేకమైన ఖర్చులకు మినహాయింపు కోరతారు.

ఒకటి కంటే ఎక్కువ పొదుపు పథకాల కింద గరిష్ఠంగా రూ.1.5 లక్షల వరకు పన్ను పొదుపు చేయొచ్చు.

80సీ సెక్షన్ కింద పన్ను డిడక్షన్‌ మార్గాలు


లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లింపు

పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్‌లో కంట్రిబ్యూషన్‌

ఎంప్లాయిస్ ప్రావిడెండ్ ఫండ్‌, వాలంటరీ ప్రావిడెండ్ ఫండ్‌లో కంట్రిబ్యూషన్స్‌

ఇంటి రుణంపై ప్రిన్సిపల్ అమౌంట్ రీపేమెంట్‌

ఇల్లు కొనుగోలు కోసం స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ చార్జీల చెల్లింపు

ఈఎల్ఎస్ఎస్ లేదా టాక్స్ సేవింగ్ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు

సుకన్య సమృద్ధి ఖాతాలో పెట్టుబడులు

పిల్లల విద్యా సంస్థల ట్యూషన్ ఫీజు చెల్లింపులు

పోస్టల్ ఫిక్స్‌డ్ డిపాజిట్ లేదా ఐదేండ్ల టాక్స్ సేవింగ్స్ బ్యాంకులో ఇన్వెస్ట్‌మెంట్స్‌

పరిమితి ఎందుకు పెంచాలంటే..


హౌస్ హోల్డ్ సేవింగ్స్‌కు ప్రోత్సాహం.. ద్రవ్యోల్బణ నియంత్రణ

మౌలిక వసతుల రంగానికి దీర్ఘకాలిక నిధులు సమకూర్చే వెసులుబాటు లభిస్తుంది

ప్రభుత్వానికి తక్కువ ఖర్చుతో నిధుల లభ్యత

భారీగా ఉపాధి కల్పించే గృహ నిర్మాణ రంగ పరిశ్రమ వృద్ధికి దోహదం

సుకన్య సమృద్ధి స్కీం కింద బాలికా విద్య, వివాహాలు తదితర సామాజిక లక్ష్యాల సాధనకు చేయూత.

కరోనాతో ఇలా జీవన వ్యయం పెరుగుదల


ఆదాయం పన్ను చట్టంలోని 80సీ కింద పన్ను మినహాయింపు పరిమితిని 2014-15లో రూ.1.5 లక్షలకు పెంచేసింది కేంద్రం. కానీ నాటి నుంచి ఇప్పటి వరకు రోజురోజుకు జీవన వ్యయం పెరిగిపోతూ వచ్చింది. మహమ్మారి వచ్చిన తర్వాత అది మరింత పెరిగింది. కనుక 80సీ సెక్షన్ కింద రూ.1.5 లక్షల వరకు పన్ను డిడక్షన్ పరిమితిని వచ్చే ఏడాదికి సమర్పించే బడ్జెట్ ప్రతిపాదనల్లోనైనా రూ.2.5 లక్షలకు పెంచాలన్న అభ్యర్థనలు వినిపిస్తున్నాయి. దీనివల్ల ప్రతి ఒక్క పన్ను చెల్లింపుదారు ఈజ్ ఆఫ్ లివింగ్‌కు సాయ పడుతుంది.

ఇలా బహుళ ప్రయోజనాలు

వ్యక్తిగత పన్ను చెల్లింపుదారుల పన్ను భారం తగ్గింపు.

రిటైర్‌మెంట్‌, పిల్లల విద్య తదితర అవసరాలు

ఇల్లు కొనుగోలుకు పెట్టుబడి

టాక్స్ పేయర్లకు సెక్యూరిటీ కల్పన


0 Comments:

Post a Comment

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Technology

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top