*FAPTO చైర్మన్ శ్రీ జోసఫ్ సుదీర్ బాబు గారి అధ్యక్షతన ఈ రోజు FAPTO రాష్ట్ర కార్యవర్గ సమావేశము STU రాష్ట్ర కార్యాలయం, విజయవాడ నందు నిర్వహించబడినది . ఈ సమావేశమునకు ఫ్యాప్టో సెక్రటరీ జనరల్ చేబ్రోలు శరత్ చంద్ర , కో చైర్మన్స్ నక్కా వెంకటేశ్వర్లు , వెలమల శ్రీనివాసరావు డిప్యూటీ సెక్రటరీ జనరల్స్ N V రమణయ్య , చందోలు వెంకటేశ్వర్లు , ట్రెజరర్ జి సౌరిరాయులు కార్యవర్గ సభ్యులు కె ఏస్ ప్రసాద్ , మల్లు రఘునాధరెడ్డి , P పాండురంగవర ప్రసాద్ , పర్రె వెంకట్రావు , మద్ది రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు.
సమావేశ తీర్మానాలు
*1 PRC పై FAPTO ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తున్నందున FAPTO సభ్య సంఘాలు వ్యక్తిగతంగా (సంఘలుగా ) ఇచ్చిన కార్యాచరణను రద్దు చెయ్యాలి.
*2 FAPTO ఉద్యమ కార్యాచరణ నోటీసు 12 .01 2022 న గౌరవ చీఫ్ సెక్రటరీ గారికి సమర్పించాలి.
3 FAPTO సభ్య సంఘాల రాష్ట్ర అధ్యక్ష , ప్రధాన కార్యదర్సులతో FAPTO ఉద్యమ కార్యాచరణ పై విస్తృత స్థాయి రౌండు టేబుల్ సమవేశం 13 . 01 . 2022 వ తేదీ 9 .౩౦ గంటలకు APTF 257 రాష్ట్ర కార్యాలయము , విజయవాడ నందు నిర్వహించాలి.
సమావేశము పై తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించిన మీదట సభ్య సంఘలన్నీ వ్యతిగతంగా (సంఘాలుగా) ప్రకటించిన కార్యచరణను రద్దు చేసుకుని పైన తెలిపిన షెడ్యూల్ ప్రకారం గౌరవ ఫ్యాప్టో బాద్యులు హాజరు కావాలసినదిగా కోరు తున్నాము.
చైర్మన్ & సెక్రటరీ జనరల్
FAPTO , AP
0 Comments:
Post a Comment