♦️నూతన విద్యా విధానానికి అనుగుణంగా స్కూళ్ల మ్యాపింగ్, సబ్జెక్టుల వారీగా బోధనా సిబ్బందిని నియమించాలి: సీఎం శ్రీ వైయస్.జగన్.
♦️నాడు – నేడు తర్వాత పెరిగిన పిల్లల సంఖ్యకు అనుగుణంగా వసతులు కల్పించాలి :
*ఇప్పటికే ఏర్పాటు చేసిన వసతుల నిర్వహణపై ప్రత్యేక దృష్టిపెట్టాలి:*
*–విద్యాశాఖపై సమీక్ష సందర్భంగా అధికారులకు సీఎం ఆదేశాలు*
*♦️అమరావతి:*
*–విద్యాశాఖపై క్యాంప్ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్.జగన్ సమీక్ష*
*–స్కూళ్ల మ్యాపింగ్, జగనన్న విద్యాకానుక, నాడు –నేడు రెండో దశ, గోరుముద్ద, సంపూర్ణ పోషణ, టాయిలెట్ల నిర్వహణ, స్వేచ్ఛ తదితర అంశాలపై సీఎం శ్రీ వైయస్.జగన్ సమీక్ష.*
*♦️ఈ సందర్భంగా సీఎం శ్రీ వైయస్.జగన్ ఏమన్నారంటే...:*
*♦️ప్రభుత్వ స్కూళ్ల నిర్వహణపై* *అధికారులకు సీఎం కీలక ఆదేశాలు*
*స్కూళ్ల మ్యాపింగ్‌కు అనుగుణంగా సిబ్బందిని నియామకం, నాడు–నేడు తర్వాత పిల్లల సంఖ్య పెరిగిన నేపథ్యంలో అదనపు వసతుల కల్పన– స్కూళ్లలో ఏర్పాటుచేసిన వసతుల నిర్వహణ, సబ్జెక్టుల వారీగా బోధనా సిబ్బంది.. ఈమూడు అంశాలపై దృష్టిపెట్టాలన్న సీఎం*
*♦️ఎప్పటికప్పుడు యాక్షన్ టేకెన్ రిపోర్టును తనకు నివేదించాలన్న సీఎం*
*🔷1.
*నూతన విద్యావిధానం ప్రకారం ఆరు రకాల స్కూళ్లను ఏర్పాటు చేశాం.*
*ఇప్పటికే కొన్నింటిని ఈ కొత్త విధానం ప్రకారం ఏర్పాటు చేశారు.*
*మిగిలిన స్కూళ్ల మ్యాపింగ్‌పై* *దృష్టిపెట్టాలన్న సీఎం, వీలైనంత త్వరగా ఈ ప్రక్రియను* *పూర్తిచేయాలన్న ముఖ్యమంత్రి*
*ఆ మేరకు సబ్జెక్టుల వారీగా ఉపాధ్యాయలు, ఇతరత్రా అవసరాలను గుర్తించి వారిని నియమించాలన్న సీఎం*
*🔶2.
*నాడు – నేడు కార్యక్రమం వల్ల* *స్కూళ్లలో పిల్లల సంఖ్య పెరిగింది:*
*ఈ నేపథ్యంలో పిల్లల సంఖ్యకు* *తగినట్టుగా మళ్లీ అక్కడ ఏర్పాటు చేయాల్సిన మౌలిక వసతుల విషయంలో వెంటనే చర్యలు తీసుకోవాలి: సీఎం*
*పిల్లల సామర్థ్యానికి తగినట్టుగా వసతులు, బోధన సిబ్బందిని పెట్టాల్సి ఉంటుంది*
*నాడు – నేడు మొదటి దశ, రెండో దశ తర్వాత పెరిగే పిల్లల సంఖ్యను పరిగణలోకి తీసుకుని అదనపు తరగతి గదులు, అదనంగా ఏర్పాటు చేయాల్సిన మౌలిక వసతులు, నియమించాల్సిన బోధనా సిబ్బందిపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలి*
🔷3.
*నాడు–నేడు ద్వారా స్కూళ్లలో ఏర్పాటు చేసిన వసతుల నిర్వహణపై కూడా ప్రత్యేక దృష్టిపెట్టాలి అధికారులకు సీఎం ఆదేశం*
*♦️దీనికి గురించి పట్టించుకోకపోతే నాడు–నేడు కింద చేపట్టిన పనులకు అర్థంలేదు :*
*దీనిపై ఒక కార్యాచరణ సిద్ధంచేసుకోవాలి*
*♦️ఈ మూడు అంశాలపై యాక్షన్ టేకెన్ రిపోర్టును తనకు నివేదించాలని అధికారులకు సీఎం ఆదేశం*
*♦️సబ్జెక్టుల వారీగా బోధనా సిబ్బంది ఉండాలని స్పష్టంచేశాం*
*♦️దీన్ని అమలు చేయడంలో ఉపాధ్యాయుల సహకారాన్ని తీసుకోవాలి*
*♦️ఉపాధ్యాయులతో మాట్లాడి వారి సలహాలు, సూచనలు తీసుకుని సమర్థవంతంగా అమలు చేయాలి*
*♦️పిల్లలకు మంచి చేసేందుకు తీసుకున్న నిర్ణయాలను వారికి వివరించి వారి భాగస్వామ్యాన్ని తీసుకోవాలి*
*♦️ఎవరైనా అభ్యంతరాలు వ్యక్తంచేస్తే వారిని కూడా పరిగణలోకి తీసుకుని వారి సూచనలతో ముందుకెళ్లాలి*
*♦️టీచర్లకు ఇంగ్లిషు బోధనపై శిక్షణ కార్యక్రమాల వివరాలు అందించిన అధికారులు*
*ఇంగ్లిషులో పరిజ్ఞానం కోసం ఉద్దేశించిన యాప్స్‌ను బాగా వినియోగించుకునేలా చూడాలన్న సీఎం.*
*♦️జిల్లా అధికారులు నిరంతరం* *స్కూళ్లను పర్యవేక్షించాలన్న సీఎం*
*గోరుముద్ద నాణ్యత పరిశీలన కొనసాగాలన్న సీఎం*
*వసతుల్లో, నిర్వహణలో లోపాలు ఉంటే వెంటనే నమోదుచేసి వాటిని సరిదిద్దడానికి చర్యలు తీసుకోవాలన్న సీఎం*
*గోరుముద్ద కింద ఇంకా కొత్త వంటకాలను అందించడంపై దృష్టిపెట్టాలన్న సీఎం*
*మన ఇంట్లో మనం తినే తిండి ఎంత శుచిగా ఉండాలనుకుంటామో, టాయిలెట్లు ఎంత పరిశుభ్రంగా ఉండాలనుకుంటామో... స్కూళ్లలో వండే ఆహారం అంతే నాణ్యతగా ఉండాలని, టాయిలెట్లు కూడా అంతే పరిశుభ్రతతో ఉండాలన్న ముఖ్యమంత్రి*
*ప్రభుత్వ పాఠశాల అనేది అందరిదీ అనే భావన రావాలన్న సీఎం*
*♦️అంగన్వాడీలుపైనా సమీక్ష.*
*🔷అంగన్వాడీలు, స్కూళ్లలో విద్యార్థుల ఆరోగ్య పరిస్థితు ల పై విలేజ్ క్లినిక్స్ దృష్టిపెట్టాలి*
*ఎప్పటికప్పుడు వారికి పరీక్షలు నిర్వహించాలి*
*రక్తహీనత లాంటి సమస్యల నివారణకు ఇది ఉపయోగపడుతుంది*
*పీహెచ్సీ డాక్టర్లకు అనుసంధానం చేస్తే వారు తగిన చికిత్సను అందిస్తారు : అధికారులకు సీఎం నిర్దేశం.*
*🔶ఈ సమీక్షా సమావేశానికి విద్యాశాఖమంత్రి ఆదిమూలపు సురేష్, విద్యాశాఖ స్పెషల్ సీఎస్ బుడితి రాజశేఖర్, మహిళా, శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ఏ ఆర్ అనురాధ,ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్ గుల్జార్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్, మహిళా శిశు సంక్షేమశాఖ డైరెక్టర్ కృతికా శుక్లా, స్కూల్ ఎడ్యుకేషన్ (మిడ్ డే మీల్స్) డైరెక్టర్ బీ ఎం దివాన్, పాఠశాల విద్యాశాఖ సలహాదారు ఎ మురళీ, సర్వశిక్షాఅభియాన్ స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ వెట్రిసెల్వి, ఏపీఆర్ఈఐఎస్ సెక్రటరీ వి రాములు, కనెక్ట్ టు ఆంధ్రా సీఈఓ కోటేశ్వరమ్మ, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ బి ప్రతాప్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.*
0 Comments:
Post a Comment