మరో విభాగం సహాయ నిరాకరణ
బిల్లుల ప్రక్రియలో పాల్గొనబోమన్న పే అండ్ అకౌంట్స్ ఉద్యోగులు
ఈనాడు, అమరావతి: ఉద్యోగులకు కొత్త పీఆర్సీ జీవోల ప్రకారమే జనవరి జీతాలను చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలగా ఉన్నా... ఆ ప్రక్రియ ముందుకు సాగే అవకాశాలు కనిపించడం లేదు. ట్రెజరీ ఉద్యోగులతోపాటు తాజాగా పే అండ్ అకౌంట్స్ విభాగం ఉద్యోగులు సైతం ఈ విషయంలో సహాయ నిరాకరణ చేయాలని నిర్ణయించారు. కొత్త జీతాల బిల్లుల ప్రక్రియలో తాము పాల్గొనబోమని వారు తేల్చి చెప్పారు. ‘‘ఒకవైపు రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులంతా కోతల పీఆర్సీ మాకొద్దని ఆందోళన చేస్తుంటే ఆర్థిక శాఖ అధికారులు మాత్రం బిల్లులు ప్రాసెస్ చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. మేం కూడా ఉద్యమంలో పాల్గొంటున్నాం. ప్రభుత్వ ఉత్తర్వులను వ్యతిరేకిస్తున్నాం. బిల్లులు సమర్పించే ప్రక్రియలో పాల్గొనాలని మాపై ఒత్తిడి చేయవద్దు’’ అని పే అండ్ అకౌంట్స్ కార్యాలయ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం.వెంకటేశ్వరరెడ్డి, ప్రధాన కార్యదర్శి జి.శివప్రసాద్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
రాష్ట్రంలోని ఖజానా శాఖ ఉద్యోగులు ఎవరూ కొత్త బిల్లులు ప్రక్రియలో పాల్గొనబోరని ఖజానా ఉద్యోగుల సర్వీసు* *అసోసియేషన్ నాయకులు పి.శోభన్‌బాబు తమ శాఖ సంచాలకులు మోహన్‌రావును శుక్రవారం కలిసి తెలియజేశారు.
0 Comments:
Post a Comment