ఇలాంటి
పీఆర్సీచరిత్రలోనే చూడలేదు
♦రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పూర్తిగా లోపించింది
♦ఉద్యోగ సంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో నేతలు
🌻ఈనాడు, అమరావతి
పీఆర్సీ నివేదికను బయట పెట్టకుండా ఫిట్మెంట్ను ప్రకటించడం చరిత్రలో ఎప్పుడూ జరగలేదని, రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పూర్తిగా లోపించిందని పీడీఎఫ్ ఎమ్మెల్సీ లక్ష్మణరావు అన్నారు. విజయవాడలోని ఎన్జీవో కార్యాలయంలో పీఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో ఉద్యోగ సంఘాల రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. జిల్లాలోని ఉద్యోగ, ఉపాధ్యాయ, ఆర్టీసీ, కార్మిక, పెన్షనర్ల సంఘాలకు చెందిన నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎమ్మెల్సీ లక్ష్మణరావు మాట్లాడుతూ రాష్ట్రంలో రాజ్యాంగం, ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ప్రభుత్వం నడుస్తోందన్నారు. ‘జగన్ సీఎం అయినా.. ఎమ్మెల్యేలు రాజ్యాంగం ప్రకారమే ఎన్నికవుతారనే విషయం గుర్తుంచుకోవాలి. రాజ్యాంగంలో ఉద్యోగులు కూడా భాగమే. వైఎస్ఆర్ సీఎంగా ఉన్నప్పుడు నేను 24సార్లు కలిశాను.. జగన్ను కేవలం రెండుసార్లు మాత్రమే కలిసే అవకాశం వచ్చింది. రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్యబద్ధంగా సీఎం నడుచుకోవాలి. ఉద్యోగులతో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించాలి. అశుతోష్ మిశ్రా నివేదికను బయట పెట్టకపోవడం అత్యంత దుర్మార్గం. ఉద్యోగ సంఘాల ఉద్యమాన్ని నీరుగార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నం చేస్తోంది. ఉద్యోగులకు వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయడం, వాలంటీర్ల ద్వారా ఇంటింటికీ కరపత్రాలను పంచడం లాంటివి చేస్తోందని లక్ష్మణరావు పేర్కొన్నారు. పీడీఎఫ్ తరఫున ఉద్యోగ సంఘాల ఆందోళనకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని తెలిపారు. ఉద్యోగులను అణగదొక్కాలని చూసిన వారంతా భ్రష్టుపట్టిపోయారనేది గుర్తుంచుకోవాలన్నారు.
♦జీవోలు రద్దు చేయకుంటే సీఎం పిలిచినా వెళ్లం..
పీఆర్సీ జీవోలు రద్దు చేయకుంటే ముఖ్యమంత్రి పిలిచినా తాము చర్చలకు వెళ్లేది లేదని ఏపీఎన్జీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివారెడ్డి తేల్చి చెప్పారు. ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిగిన సమయంలో సీఎం స్క్రిప్టు తీసుకొచ్చి చదివారంటూ ఆయన విమర్శించారు. ఫిట్మెంట్ ప్రకటించి ఇతర సమస్యలను సీఎస్తో మాట్లాడుకోమంటూ వెళ్లిపోయారన్నారు. మా అభ్యంతరాలను చెప్పిన తర్వాత కూడా రాత్రికి రాత్రి జీవోలను విడుదల చేశారు. గత ప్రభుత్వంలో సాధించుకున్న లబ్ధిని కూడా తొలగించారు. ఉద్యోగులు ఎవరూ కొత్త జీతాలను తీసుకోరంటూ శివారెడ్డి పేర్కొన్నారు. ఈ పోరాటంలో తుది విజయం ఉద్యోగులదే అవుతుందని స్పష్టం చేశారు.
0 Comments:
Post a Comment