📚✍పాఠశాలల మ్యాపింగ్ పరిశీలనకు కమిటీ..
🌻ఆంధ్రప్రభ అమరావతి: రాష్ట్రంలో కొన్ని జిల్లాల లో ఇప్పటికే మ్యాపింగ్ ప్రక్రియ ప్రారంభం కాగా.. మరి కొన్ని జిల్లాల్లో సంక్రా ంతి సెలవుల అనంతరం చేపట్టనున్నారు. మ్యాపింగ్ సేకరించిన సమాచారాన్ని, రూపొందించిన నివేదికల ను ఎప్పటికప్పుడు ప్రధానోపాధ్యాయులు ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మ్యాపింగ్ ప్రక్రియలో భాగంగా ప్రధానోపాధ్యాయులు పలు వివరాలను సేకరి ంచాల్సి ఉంటుంది. విలీనంతో విద్యార్థులకు ఎదురయ్యే ఇబ్బందులు, ఉన్న బడులకు, విలీనానంతరం పాఠశాలలకు దూరం ఎంత పెరుగుతుంది, మార్గంలో రైల్వే లెవల్ క్రాసింగ్స్, కాల్వలు వంటివి దాటాల్సి ఉంటుందా, ఉన్న తరగతి గదుల సంఖ్య, విలీనంతో విద్యార్థుల సంఖ్య పెరిగితే ఇంకా ఎన్ని గదులు కావాల్సి ఉంటుందనే వివరాలు విద్యాశాఖకు అందజేయాల్సి ఉంటుంది.
0 Comments:
Post a Comment