అమరావతి: ఏపీ సచివాలయంపై కరోనా ఎఫెక్ట్ పడింది.
సాధారణ పరిపాలనశాఖలో నలుగురికి, ఆర్థికశాఖలో ఒకరికి కరోనా సోకింది.
తొలి రెండు వేవ్‌లలో సచివాలయంలోనే వందలాది కేసులు నమోదయ్యాయి.
కరోనా ప్రభావంతో వర్క్ ఫ్రం హోంకు అవకాశం ఇవ్వాలంటూ ఉద్యోగుల విజ్ఞప్తి చేశారు.
సచివాలయంలో శానిటైజేషన్‌ను ప్రభుత్వం గాలికొదిలేసిందనే విమర్శలు వస్తున్నాయి.
కొత్తగా కేసులు నమోదవడంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.
మరోవైపు రాష్ట్రంలో 27 వేలకు కరోనా యాక్టివ్ కేసులు చేరాయి. కరోనా బాధితుల్లో 1100 మందికి పైగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో 60 శాతానికి పైగా ఆక్సిజన్‌పై చికిత్స తీసుకుంటున్నారంటూ సీఎం జగన్ కొవిడ్ రివ్యూలో తెలిపారని చెబుతున్నారు.
భారీ స్థాయిలో ఆక్సిజన్ బెడ్స్ వాడకంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.
0 Comments:
Post a Comment