'అలా' ప్రచారం చేసేవారిపై చర్యలు : ఆదిమూలపు సురేష్
అమరావతి : పాఠశాలలకు సెలవులంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేసి, వైరల్ చేస్తున్న వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ హెచ్చరించారు.
కొందరు సోషల్ మీడియా వేదికగా చేస్తున్న తప్పుడు ప్రచారంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రచారాలను తల్లిదండ్రులు, విద్యార్థులు నమ్మవద్దన్నారు. కొన్ని ఛానెల్స్ పేరుతో మార్ఫింగ్ చేసి బ్రేకింగ్ న్యూస్ అంటూ పాఠశాలలకు సెలవులు అంటూ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. హాస్టల్ విద్యార్థులు ఇళ్లకు వెళ్ళండి అని కొందరు ప్రచారం చేయటాన్ని మంత్రి తప్పుపట్టారు. ఇటువంటి ప్రచారాలకు పాల్పడుతున్న వారు, వాటిని సోషల్ మీడియా ద్వారా వైరల్ చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
0 Comments:
Post a Comment