తిరుమలకు మరో ఘాట్ రోడ్డు సిద్ధం చేస్తున్న టీటీడీ
తిరుమలలో శ్రీవారిని దర్శించుకునే వచ్చే భక్తుల కోసం టీటీడీ మరో దారిని సిద్ధం చేయనుంది. వెంకటేశ్వరస్వామికి పరమ భక్తుడైన తాళ్లపాక అన్నమాచార్యులు నడిచిన మార్గాన్ని అభివృద్ధి చేసేందుకు టీటీడీ సిద్ధమైంది.
తాజాగా మామండూరు నుంచి తిరుమల పార్వేట మండపం వరకు ఉన్న అన్నమయ్య మార్గాన్ని ఆదివారం టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్నమాచార్యులు నడిచిన మార్గం ద్వారా వాహనాలు, నడక ద్వారా భక్తులు తిరుమలకు చేరుకునేలా రోడ్డు అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. వెంటనే సమగ్ర సర్వే చేసి అటవీశాఖ అనుమతి కోసం ప్రతిపాదనలు పంపాలని అధికారులను ఆదేశించారు. మామండూరు నుంచి తిరుమలకు 23 కిలోమీటర్ల దూరం వరకు ప్రణాళికలు తయారు చేయాలని చెప్పారు. హైదరాబాద్, వైఎస్సార్ కడప మార్గం ద్వారా తిరుమలకు వచ్చే భక్తులకు అన్నమయ్య మార్గం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. అలాగే భారీ వర్షాల వల్ల ఇటీవల భారీ కొండ చరియలు విరిగిపడి తిరుమలకు ఘాట్ రోడ్ భారీగా దెబ్బతిన్న నేపథ్యంలోభవిష్యత్తులో ఇలాంటి ఉపద్రవాలు ఎదురైనా భక్తులకు ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయంగా కూడా అన్నమయ్య మార్గం ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు. త్వరలోనే టెండర్లు పిలిచి ఈ మార్గం అభివృద్ధి చేస్తామన్నారు. అటవీ ప్రాంతంలో వన్య ప్రాణులకు ఇబ్బంది లేకుండా మామండూరు నుంచి తిరుమలకు 23 కిలోమీటర్ల దూరం వరకు ప్రణాళికలు తయారు చేయాలని అధికారులను ఆదేశించినట్టు తెలిపారు.
హైదరాబాద్ : తిరుమలలో శ్రీవారిని దర్శించుకునే వచ్చే భక్తుల కోసం టీటీడీ మరో దారిని సిద్ధం చేయనుంది. వెంకటేశ్వరస్వామికి పరమ భక్తుడైన తాళ్లపాక అన్నమాచార్యులు నడిచిన మార్గాన్ని అభివృద్ధి చేసేందుకు టీటీడీ సిద్ధమైంది.
తాజాగా మామండూరు నుంచి తిరుమల పార్వేట మండపం వరకు ఉన్న అన్నమయ్య మార్గాన్ని ఆదివారం టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్నమాచార్యులు నడిచిన మార్గం ద్వారా వాహనాలు, నడక ద్వారా భక్తులు తిరుమలకు చేరుకునేలా రోడ్డు అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. వెంటనే సమగ్ర సర్వే చేసి అటవీశాఖ అనుమతి కోసం ప్రతిపాదనలు పంపాలని అధికారులను ఆదేశించారు. మామండూరు నుంచి తిరుమలకు 23 కిలోమీటర్ల దూరం వరకు ప్రణాళికలు తయారు చేయాలని చెప్పారు. హైదరాబాద్, వైఎస్సార్ కడప మార్గం ద్వారా తిరుమలకు వచ్చే భక్తులకు అన్నమయ్య మార్గం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. అలాగే భారీ వర్షాల వల్ల ఇటీవల భారీ కొండ చరియలు విరిగిపడి తిరుమలకు ఘాట్ రోడ్ భారీగా దెబ్బతిన్న నేపథ్యంలోభవిష్యత్తులో ఇలాంటి ఉపద్రవాలు ఎదురైనా భక్తులకు ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయంగా కూడా అన్నమయ్య మార్గం ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు. త్వరలోనే టెండర్లు పిలిచి ఈ మార్గం అభివృద్ధి చేస్తామన్నారు. అటవీ ప్రాంతంలో వన్య ప్రాణులకు ఇబ్బంది లేకుండా మామండూరు నుంచి తిరుమలకు 23 కిలోమీటర్ల దూరం వరకు ప్రణాళికలు తయారు చేయాలని అధికారులను ఆదేశించినట్టు తెలిపారు.
0 Comments:
Post a Comment