✍కొత్త పీఆర్సీ... కొత్త జీతాలు
♦ట్రెజరీ కార్యాలయాలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ
🌻అమరావతి, ఆంధ్రప్రభ : ఒక వైపు నూతన పీఆర్సీని ఉద్యోగులు వ్యతిరేకిస్తున్న
నేపథ్యంలో నూతన పీఆర్సీ ప్రకారమే ఉద్యోగులకు జీతాలు చెల్లింపునకు ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. ఈమేరకు ప్రభుత్వం ట్రెజరీ కార్యాలయాలకు
ఆదేశాలు జారీ చేసింది. సవరించిన పే స్కేల్స్ ఆధారంగా ఉద్యోగుల జీతాల్లోమార్పులు చేయాలని డీడీవోలు, ట్రెజరీ ఉద్యోగులను ఆదేశిస్తూ ప్రభుత్వం సర్క్యూలర్ జారీ చేసింది. దీంతో జీతాలు చెల్లింపునకు సీఎఫ్ఎంఎస్ ప్రత్యేక సాఫ్ట్వేర్ను సిద్దం చేసింది.
♦సర్దుబాటుకు నిరాకరణ..
ఇదిలావుండగా, సవరించిన వేతన బిల్లులు ప్రాసెస్ చేయబోమని డీడీవోలు, ట్రె జరీ ఉద్యోగులు తేల్చిచెప్పారు. అయితే కొత్త. తమ జీతాల వరకైనా ప్రాసెస్ చేసుకో వాలని ట్రెజరీ సిబ్బందికి అధికారులు సూచించారు. కాని ప్రాసెస్ చేయడానికి డీడీవోలు, ట్రెజరీ ఉద్యోగులు నిరాకరిస్తున్నారు. తమపై ఒత్తిడి తేవద్దని పేర్కొ న్నారు. తాము కూడా ఉద్యమంలో భాగమేనని ట్రెజరీ ఉద్యోగుల సంఘం స్పష్టం చేస్తోంది. ప్రభుత్వం పెండింగ్ డీఏలు మంజూరు చేసి.. జీతం పెరిగినట్లు చూపిస్తున్నారని ట్రెజరీ ఉద్యోగుల సంఘం అభ్యంతరం తెలుపుతోంది. హెన్ఆర్ఎ స్లాబులో కోత విధించడం అన్యాయమని ట్రెజరీ ఉద్యోగులు వాపోతున్నారు. పలు జిల్లాల్లో వేతన బిల్లులను ట్రెజరీ ఉద్యోగులు ప్రాసెస్ చేయలేదు. ఈనెల 25లోగా బిల్లులను ప్రాసెస్ చేయాలని ఆర్థికశాఖ ఆదేశించారు. అయితే ట్రెజరీ ఉద్యోగులు, డ్రాయింగ్ అధికారులు నిరాకరించారు. కొత్త పీఆర్సీ జీవోలు రద్దు చేయాలని ట్రెజరీ ఉద్యోగుల సంఘం డిమాండ్ చేస్తూ.. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.
0 Comments:
Post a Comment