✍మిగిలిన పరీక్షల షెడ్యూల్లో మార్పు..
🌻ఆంద్రప్రభ అమరావతి: అర్ధ వార్షిక పరీక్షలను షెడ్యూల్ ప్రకారమే నిర్వహించి, అనంతరం జరగాల్సిన యూనిట్ టెస్టులు, ఫైనల్ పరీక్షలను మాత్రం కాస్త ముందుగా జరపాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతున్న పరిస్థితిని దృష్టిలో ఉంచుకునని ఈ మేరకు నిర్ణయించారు. దీని ప్రకారం గతంలో యూనిట్ టెస్టులుగా నిర్వహించి, ప్రస్తుతం నిర్వహిస్తున్న ఫార్మేటివ్ అసెస్మెంట్- 3 పరీక్షలను ఫిబ్రవరిలో, ఫార్మేటివ్ అసెస్మెంట్- 4 పరీక్షలను మార్చిలో జరపాలని నిర్ణయించారు. అలాగే సంవత్సరాంత పరీక్షలను (ఫైనల్) ఏప్రిల్లో పూర్తి చేయాలని భావిస్తున్నారు. పరీక్షల అనంతరం రాష్ట్రవ్యాప్తంగా 1 నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు ఏప్రిల్ 30వ తేదీతో విద్యా సంవత్సరాన్ని ముగించాలని నిర్ణయించారు.
0 Comments:
Post a Comment