🔳భజన సంఘాలతో ఉద్యోగుల భవిష్యత్‌కు దెబ్బ.
ప్రజలను రెచ్చగొట్టే కుట్రలపై ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలి ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ అసోసియేషన్ పిలుపు
విజయవాడ(వన్‌టౌన్), జనవరి 5: ప్రభుత్వ పెద్దలకు భజన చేసే ఉద్యోగ సంఘాలతో ఉద్యోగులకు భవిష్యత్ ఉండదని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వినుకొండ రాజారావు, కార్యదర్శి కొండపల్లి శ్రీనివాసరావులు అన్నారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఉద్యోగుల జీత భత్యాలకే అఽధికమొత్తం చెల్లిస్తున్నామని ప్రభుత్వం చెప్పడం దారుణమన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు తమకు న్యాయంగా రావాల్సిన హక్కుల సాధనకు ఇప్పటి వరకు వేచి చూశారని, ఓపిక నశించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఉద్యమానికి సిద్ధమవుతున్నారని తెలిపారు. ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతిలో సభ్యులుగాఉన్న ఉద్యోగులు రోడ్డెక్కి ఉద్య మం చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ అసోసియేషన్ స్వచ్ఛందంగా ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని నిర్ణయించిందన్నారు. త్వరలో కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. సివిల్ సర్వీస్ జాయింట్ కౌన్సిల్‌కు హాజరై ఉద్యోగుల హక్కుల కోసం మాట్లాడామని పత్రికలలో ప్రకటన ఇచ్చారని, అయితే వారంతా మౌనం దాల్చడానికి కారణమేమిటని ప్రశ్నించారు. ఉద్యోగ సంఘాలకు ఎన్ని జెండాలై నా ఉండొచ్చుకానీ, ఉద్యోగుల సంక్షేమమే ప్రధాన అజెండాగా ఉండాలన్నారు. మౌనంగా ఉన్న ఉద్యోగ సంఘాలు ఉద్యమంలో భాగస్వామ్యం కావాలన్నారు. ఉద్యోగులపై జరుగుతున్న కుట్రను ఎదుర్కొనాలంటే అన్ని సంఘాలు సంఘటితం కావాలని సూచించారు. ఉద్యోగులపై ప్రజలను ఉసిగొలిపే కుట్ర జరుగుతోందని తెలిపారు. ప్రజాప్రతినిధులకు జీతాలు పెరిగినంతగా మరే రాష్ట్రంలోనూ పెరగలేదన్నారు. ఏ రాష్ట్రంలోనూ పదుల సంఖ్యలో సలహాదారులు లేరన్నారు. వారి జీతభత్యాలు, ఖర్చులు ఉద్చోగుల మీద వేయడం భాధాకరమన్నారు. ఈ కుట్రను తిప్పికొట్టాల్సిన బాధ్యత ప్రతి ఉద్యోగిపై ఉందని పిలుపునిచ్చారు.
0 Comments:
Post a Comment