AP: రివర్స్ పీఆర్సీసీపై దండెత్తిన సచివాలయ ఉద్యోగులు
అమరావతి: జగన్ సర్కార్‌పై రివర్స్ పీఆర్సీ విషయంలో సచివాలయ ఉద్యోగులు దండెత్తారు.
రివర్స్ పీఆర్సీపై సచివాలయ ఉద్యోగుల సంఘ నేతలను ఉద్యోగులు నిలదీశారు. ఈ క్రమంలో ఉద్యోగులతో కలసి ఉద్యోగ సంఘం నేత వెంకట్రామిరెడ్డి సీఎస్‌కు రిప్రసెంటేషన్ ఇచ్చేందుకు వెళ్లారు. రివర్స్ పీఆర్సీపై ఉద్యోగులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. వందలాది మంది ఉద్యోగులు ర్యాలీగా సీఎస్ ఆఫీస్ వైపు కదిలారు. కాగా... ఒకటవ బ్లాక్ వద్ద ఉద్యోగులను భద్రతా సిబ్బంది అడ్డగించారు. కొంతమంది ఉద్యోగులను మాత్రమే సిబ్బంది లోనికి అనుమతించారు.
సచివాలయ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు వెంకట్రామి రెడ్డి మాట్లాడుతూ... గత రెండు నెలలుగా పీఆర్సీపై ప్రభుత్వం చర్చిస్తోంది. ఉద్యోగులు ఆశించిన విధంగా పీఆర్సీ జీవోలు లేవు. ఆఫీసర్స్ కమిటీని మొదటి నుంచి వ్యతిరేకించాం. ఫిట్మెంట్ తక్కువైనా.. మిగిలిన అన్ని విషయాలను దృష్టిలో పెట్టుకుని అప్పట్లో అంగీకరించాం. హెచ్చార్ఏ విషయంలో క్లారిటీ ఇవ్వాలని గతంలో సీఎంకు చెప్పాం. హెచ్చార్ఏను తగ్గించడాన్ని.. ఇతర అంశాలపై ప్రభుత్వం జారీ చేసిన జీవోలను ప్రతి ఉద్యోగి వ్యతిరేకిస్తున్నారు.
కొన్ని అంశాల్లో రాజీ పడడానికి సిద్దమే. కానీ ప్రతి అంశంలోనూ రాజీపడితే చరిత్ర మమ్మల్ని క్షమించదు. పీఆర్సీ జీవోను వెనక్కు తీసుకోవాలి. మిగిలిన సంఘాలతో కూడా కలిసి చర్చించుకుని ఉమ్మడి వేదిక మీదకు వచ్చి పోరాడేందుకు సిద్దం. మిగతా సంఘాలకు ఏమైనా ఇగోలుంటే మేమే ముందుకు వచ్చి మాట్లాడ్డానికి సిద్దం. ఈ సాయంత్రం సీఎం అప్పాయింట్మెంట్ కోరుతున్నాం. భవిష్యత్ కార్యాచరణపై మళ్లీ భేటీ అవుతాం. రేపు లేదా ఎల్లుండి నుంచి ఉద్యమించేందుకు సన్నద్దంగా ఉన్నాం.
0 Comments:
Post a Comment