AP PRC: ఆర్థికశాఖ హెచ్చరిక.. సెలవు రోజూ విధుల్లోకి ట్రెజరీ ఉద్యోగులు
AP PRC: ఆర్థికశాఖ హెచ్చరిక.. సెలవు రోజూ విధుల్లోకి ట్రెజరీ ఉద్యోగులు
అమరావతి: ఏపీలో ట్రెజరీ ఉద్యోగులు, డీడీవోలు సెలవు రోజూ (ఆదివారం) విధులకు హాజరయ్యారు.
ఉద్యోగులకు తాజా పీఆర్సీ ప్రకారమే జీతాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో జీతాల ప్రాసెస్కు సహకరించని ట్రెజరీ ఉద్యోగులు, అధికారులపై చర్యలు ఉంటాయని ఆర్థికశాఖ ఉన్నతాధికారులు ఇప్పటికే మౌఖికంగా ఆదేశాలు ఇచ్చారు. 11వ పీఆర్సీ ప్రకారం జీతాల బిల్లులు అప్లోడ్ చేయకుంటే క్రమశిక్షణా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఆదివారం కూడా ట్రెజరీ ఉద్యోగులు విధులకు హాజరయ్యారు. ప్రథమ ప్రాధాన్యంగా జడ్జిలు, పోలీసు, మున్సిపల్ ఉద్యోగుల జీతాల బిల్లులను అప్లోడ్ చేస్తున్నారు.
0 Comments:
Post a Comment