దిల్లీ: ఏపీ ఆర్థిక పరిస్థితిపై కేంద్ర ఆర్థికశాఖ కార్యాలయంలో కీలక సమావేశం జరుగుతోంది. కేంద్ర కార్యదర్శుల కమిటీతో ఏపీ ప్రభుత్వ ప్రతినిధి బృందం భేటీ అయింది.
గతనెలలో ప్రధాని మోదీని ఏపీ సీఎం జగన్ కలిసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని.. కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఈ మేరకు వినతిపత్రం అందించారు. విభజన చట్టంలోని పెండింగ్ అంశాలు, రెవెన్యూ లోటు, పోలవరం నిధులు తదితర అంశాలపై ప్రధానితో చర్చించారు. ఈ నేపథ్యంలో ప్రధాని కార్యాలయం కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శి నేతృత్వంలో ఐదుగురు కార్యదర్శులతో కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీతో ఏపీ ప్రభుత్వ బృందం ఈరోజు భేటీ అయింది.
ఏపీ బృందంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి, సీఎస్ సమీర్ శర్మ, ఆర్థికశాఖ కార్యదర్శి ఉన్నారు. ప్రధానికి సీఎం జగన్ ఇచ్చిన లేఖలోని అంశాలతో పాటు ఆర్థిక పరమైన అంశాల్లో ఏపీ ప్రభుత్వ విధానం, అప్పుల తీరు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పరిమితులు, ఎఫ్ఆర్బీఎం పరిమితులు తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన బకాయిలపైనా చర్చించనున్నట్లు సమాచారం. సమావేశం అనంతరం కేంద్ర కార్యదర్శుల బృందం తమ నివేదికను ప్రధాని కార్యాలయానికి సమర్పించే అవకాశముంది. అయితే ఈ సమావేశంపై అటు కేంద్రం ప్రభుత్వం.. ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
0 Comments:
Post a Comment