Search This Blog

Monday, 3 January 2022

ఉపాధ్యాయ ఖాళీలపై వేటు! ♦4,764 ఎస్‌జీటీ పోస్టులకు రెక్కలు.. రహస్యంగా రద్దు.. ‘ఆంధ్రజ్యోతి’ స్పెషల్ ఆర్టికల్

✍ఉపాధ్యాయ ఖాళీలపై వేటు!

♦4,764 ఎస్‌జీటీ పోస్టులకు రెక్కలు.. రహస్యంగా రద్దు

♦మోడల్‌ స్కూళ్ల సిబ్బందికి సర్వీసు నిబంధనల సాకుతో చీకటి నిర్ణయం

 🔺010 పద్దు కింద జీతాలు కోరినందుకు అడ్డగోలుగా మెలిక పెట్టిన ప్రభుత్వం ‘ఆంధ్రజ్యోతి’ చేతికి రద్దు ఉత్తర్వులు

టీచర్ల కొరతతో సతమతమవుతున్న ప్రాథమిక పాఠశాలలపై మరో పిడుగు పడింది. బడుల్లో ఖాళీలను భర్తీ చేయకపోగా... వేలాదిగా ఉపాధ్యాయ పోస్టులు రద్దు చేస్తూ సర్కారు రహస్యంగా ఉత్తర్వులు ఇచ్చింది. మోడల్‌ స్కూళ్ల టీచర్లకు సర్వీసు నిబంధనలతో మెలిక పెడుతూ, 010 పద్దు కింద జీతాలు చెల్లించమన్నందుకు ఇప్పుడు వారిని కొత్తగా ప్రభుత్వంలోకి తీసుకున్నట్లుగా కాకిలెక్కలు వేసింది. 3,260 మంది మోడల్‌ స్కూళ్ల సిబ్బంది జీతాలను లెక్కగట్టి దానికి అనుగుణంగా 4,764 ఎస్‌జీటీ పోస్టులను రద్దు చేసింది. 

*🌻(అమరావతి-ఆంధ్రజ్యోతి)* ప్రాథమిక పాఠశాలల్లో వేలాది సెకండరీ గ్రేడ్‌ టీచర్ల (ఎస్‌జీటీ) పోస్టులను ప్రభుత్వం రద్దు చేసింది. కుంటిసాకులతో ఖాళీల భర్తీ ప్రక్రియను ఎగ్గొట్టడమే కాకుండా... అత్యంత రహస్యంగా వాటిని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటికే పాఠశాలల్లో 13 వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీచేసి పిల్లలకు మెరుగైన విద్యను అందించే దిశగా చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం, ఇక భవిష్యత్తులో కూడా ఆ అవసరం లేకుండా ఆదేశాలిచ్చింది. తరగతికి ఒక ఉపాధ్యాయుడు చొప్పున లెక్కించినా ఇంకా వేలాది ఖాళీలను భర్తీ చేయాల్సి ఉంది. కానీ 4,764 ఎస్‌జీటీ పోస్టులను రద్దు చేస్తూ ప్రభుత్వం కొద్ది నెలల క్రితమే ఉత్తర్వులిచ్చినా వాటిని రహస్యంగా ఉంచింది. ఇప్పుడు ఈ ఉత్తర్వులు ‘ఆంధ్రజ్యోతి’కి లభించాయి.  


*♦పద్దు మార్చమన్నందుకు రద్దు* కేంద్ర ప్రభుత్వ పథకం కింద ఏర్పాటైన మోడల్‌ స్కూళ్లలో టీచర్లను రాష్ట్ర ప్రభుత్వమే డీఎస్సీ కింద నియమించినా వారికి సర్వీస్‌ రూల్స్‌ రూపొందించలేదు. ప్రభుత్వ ఉపాధ్యాయులకు జీతాలు ఇచే ్చ 010 పద్దు కింద కాకుండా వేరే పద్దు కింద వీరికి జీతాలు ఇస్తున్నారు. తమకు కూడా ప్రభుత్వ ఉపాధ్యాయులతో కలిపి జీతాలు ఇవ్వాలని వీరంతా ఎప్పటినుంచో డిమాండ్‌ చేస్తున్నారు. అంటే ఇప్పటికే ఒక పద్దు కింద ఇప్పటికే ఇస్తున్న జీతాలను మరో పద్దు కిందకు మార్చడమే. అంతకుమించి దీంట్లో కొత్తగా భర్తీ చేసే టీచర్ల పోస్టులేవీ ఉండవు. అయినా మోడల్‌ స్కూళ్ల టీచర్లకు 010 కింద జీతాలు చెల్లించడమంటే వారంతా ప్రభుత్వంలోకి కొత్తగా వచ్చినట్లే అనే వింత వాదనను సర్కారు తెరపైకి తీసుకొచ్చింది. 3,260 మంది మోడల్‌ స్కూళ్ల ప్రిన్సిపాళ్లు, పీజీటీలు, టీజీటీల జీతాలకు ప్రతి నెలా రూ.10.20కోట్లు ఖర్చవుతుందని లెక్కగట్టింది. ఈ బడ్జెట్‌ 4,764 మంది ఎస్‌జీటీల జీతాలతో సమానమని తేల్చింది. దానికి అనుగుణంగా ఖాళీగా ఉన్న పోస్టులు రద్దు చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలో 13,555 ఎస్‌జీటీ ఖాళీలున్నాయని... ఇందులో 4,764 రద్దు చేయాలని ఉత్తర్వులిచ్చింది. జీతాల పద్దు మార్చినందుకు పోస్టులు రద్దు చేస్తారా అని ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే ప్రాథమిక పాఠశాలలను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేసిన తర్వాత... చాలావరకు ప్రాథమిక పాఠశాలలు ఏకోపాధ్యాయగా మారిపోయాయి. అలా కాకుండా ఉండాలంటే కూడా రాబోయే కాలంలో అయినా ఖాళీగా ఉన్న ఎస్‌జీటీ పోస్టులను భర్తీ చేయాలి. కానీ ఇకపై భర్తీ చేసే అవసరమే లేదని, ఏకంగా వాటిని రద్దు చేసేశామని అధికారికంగా నిర్ణయించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

0 Comments:

Post a Comment

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Technology

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top