✍ఇకపై ఉమ్మడి పోరాటం
♦ఏకతాటిపైకి ఉద్యోగ సంఘాలు
♦నేడు సమ్మె నోటీసు
🌻అమరావతి, ఆంధ్రప్రభ:
పీఆర్సీ అంశంలో ప్రభుత్వంపై పోరాటం చేసేందుకు ఉద్యోగసంఘాలన్నీ ఉమ్మడి కార్యాచరణకు సిద్ధమవుతున్నాయి. ఈ మేరకు విజయవాడలోని ఓ హోటల్లో గురువారం ఉద్యోగ సంఘాల నేతలు సమా వేశమై పోరాట వ్యూహంపై సమాలోచనలు చేశారు. ఈ సందర్భంగా ఏపీ జేఏసీ ఛైర్మన్ బండి శ్రీనివాసరావు, ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటే "శ్వర్లు, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ, సచివా లయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిలు మీడియాతో మాట్లా డారు. ఈనెల 21న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)కు సమ్మె నోటీసు ఇస్తామని తెలిపారు. సమ్మె నోటీసుపై వెనక్కి తగ్గే ఆలోచనే లేదు.. మరికొన్ని సంఘాలతోనూ సమ్మె నోటీసుపై శుక్రవారం చర్చించనున్నట్టు వెల్లడించారు. శుక్రవారం ఉదయం 11.30 గంటలకు సచివాలయ జేఏసీ ఆధ్వర్యంలో సమావేశమై ఉమ్మడి పోరాటం విధి విధానాలు రూపొందిస్తామని తెలిపారు. కొత్త పీఆర్సీ వల్ల ఉద్యోగులందరూ నష్టపోతున్నారు. ఉద్యోగ సంఘాల మధ్య కొద్దిపాటి అభిప్రాయబేధాలున్నప్పటికీ ఉమ్మడి పోరాటం చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. ప్రభుత్వం బేషజాలకు పోకుండా ఉద్యోగుల న్యాయమైన హక్కులను పరిరక్షించాలి.. కోరికలను నెరవేర్చాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
0 Comments:
Post a Comment