జూన్ 30 కల్లా కారుణ్య నియామకాలు - గ్రామ, వార్డు సచివాలయాలలో పోస్టింగ్స్
రాష్ట్రంలో కారుణ్య నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ ఉద్యోగులుగా ఉంటూ కోవిడ్‌తో మరణించిన ఫ్రంట్‌లైన్ వారియర్స్ వారసులకు గ్రామ, వార్డు సచివాలయాలలో ఖాళీగా ఉను పోస్టులలో నియమించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
ఈ ఏడాది జూన్ 30వ తేదీలోగా అర్హులైన వారికి కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు ఇవ్వాలని సాధారణ పరిపాలన శాఖ (జిఎడి) ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ ఆదేశించారు. ఈ మేరకు ఆయన జిఓఆర్టి నంబరు 91ను విడుదల చేశారు. గతేడాది నవంబరు 30నాటికే కారుణ్య నియామకాలు చేపట్టాల్సి ఉండగా, పెద్ద సంఖ్యలో దరఖాస్తులు ఉండటంతో ప్రభుత్వం ఆ ప్రక్రియను వాయిదా వేసింది.
0 Comments:
Post a Comment