*📚✍ఫిట్‌మెంట్‌పై ‘ఫ్యాప్టో పోరాటం
♦20న కలెక్టరేట్ల ముట్టడి..
♦28న ‘చలో విజయవాడ
🌻అమరావతి, జనవరి 13(ఆంధ్రజ్యోతి): ఉద్యోగులు, ఉపాధ్యాయులకు 27శాతం కంటే ఎక్కువ ఫిట్మెంట్ ఇవ్వాలన్న డిమాండ్‌తో ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య(ఫ్యాప్టో) పోరాట కార్యాచరణను ప్రకటించింది. యూటీఎఫ్, ఏపీటీఎఫ్, ఎస్టీయూ, డీటీఎఫ్, ఎస్టీయూఎస్, ఏపీపీటీఏ, హెఎంఏ, ఎస్ఏ.అసోసియేషన్ తదితర సంఘాలు గురువారం విజయవాడలో సమావేశమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం 23శాతం ఫిట్మెంట్ ప్రకటించడాన్ని ఆయా సంఘాల నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. సీఎస్ కమిటీ ఇచ్చిన సిఫారసులను రద్దు చేయాలని, అశుతోష్ మిశ్రా కమిటీ రిపోర్టును బహిర్గతం చేయాలని, పాత హెచ్ఆర్ఏ కొనసాగించాలని, ఏక్యూపీ యథావిధిగా అమలుచేయాలని డిమాండ్ చేశారు.
ఈ డిమాండ్ల సాధనకు వచ్చే 20న అన్ని జిల్లాల కలెక్టరేట్లను ముట్టడించాలని, 28న ‘చలో విజయవాడ’ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించినట్లు ఫ్యాప్టో చైర్మన్ జోసెఫ్ సుధీర్‌బాబు, సెక్రటరీ జనరల్ శరత్చంద్ర, నేతలు ఎన్.వెంకటేశ్వర్లు, కె.భానుమూర్తి, కె.కులశేఖర్‌రెడ్డి, వి.శ్రీనివాసరావు, ఎన్.వి.రమణయ్య, చందోలు వెంకటేశ్వర్లు, జి.శౌరిరాయలు, కె.ప్రకాశ్‌రావు సంయుక్తంగా ప్రకటించారు.
0 Comments:
Post a Comment