🔳వైద్య, ఆరోగ్యశాఖలో బదిలీలు
జీవో విడుదల, 1 నుంచి ప్రక్రియ.. ఐదేళ్లు దాటిన వారికి తప్పనిసరి
గ్రామీణంలో 3 ఏళ్లు, గిరిజన ప్రాంతాల్లో 2 ఏళ్లు చేసినవారికి చాన్స్ఉద్యోగుల రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్లు కూడా ఫిబ్రవరి 21 నాటికి పోస్టింగ్ ఆర్డర్లు దరఖాస్తు, ఆర్డర్ అన్నీ ఆన్లైన్లోనేఉత్తర్వుల్లో ఆరోగ్యశాఖ పీఎస్ వెల్లడిఉద్యోగులు సమ్మెకు సిద్ధమైన సమయంలో ఉత్తర్వుల జారీపై పలు సందేహాలు
అమరావతి, జనవరి 28(ఆంధ్రజ్యోతి): వైద్య, ఆరోగ్యశాఖలో సాధారణ బదిలీలకు రంగం సిద్ధమైంది. దీనికి సంబంధించి ప్రభుత్వం తాజాగా జీవో జారీ చేసింది. ఐదేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్నవారికి బదిలీల్లో ప్రాధాన్యం ఉంటుందని పేర్కొంది. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో 3 సంవత్సరాలు, గిరిజన ప్రాంతాల్లో రెండేళ్లపాటు పనిచేసిన వారికి కూడా బదిలీల్లో అవకాశం కల్పిస్తున్నట్టు పేర్కొంది. ఇక, ఉద్యోగుల రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్లకు కూడా సర్కారు అంగీకారం తెలిపింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి(పీఎస్) ముద్దాడ రవిచంద్ర శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. వాస్తవానికి గత ఏడాది అక్టోబరు నుంచి వైద్య, ఆరోగ్యశాఖలో బదిలీలు చేపడతామని ప్రభుత్వం, ఉన్నతాధికారులు ఊరిస్తూనే ఉన్నారు. నెలలు గడుస్తున్నా బదిలీల జీవో మాత్రం విడుదల కాలేదు. రెండు నెలల కిందట కేవలం పరస్పర బదిలీలు మాత్రమే చేపడుతున్నామని లీక్‌లు ఇచ్చారు. దీనికి సంబంధించిన ఆదేశాలు కూడా విడుదల కాలేదు.
ఇదిలావుంటే, ఉద్యోగులు పీఆర్సీపై ఫిబ్రవరి 7 నుంచి సమ్మెకు సిద్ధమవుతున్న నేపథ్యంలో తాజాగా బదిలీల ప్రక్రియను తెరమీదకు తేవడంతో ఉద్యోగులు పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. సమ్మె నుంచి తమ దృష్టిని మళ్లించేందుకే ఈ జీవో ఇచ్చారా? అనివారు ప్రశ్నిస్తున్నారు. 1 నుంచి ప్రక్రియవైద్య, ఆరోగ్య శాఖలో బదిలీల ప్రక్రియ ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభం కానుంది. ఆ నెల ఆఖరు వరకు ఈ బదిలీలు ఆన్లైన్ ద్వారానే జరగనున్నాయి. ఫిబ్రవరిలో పదవీ విరమణ పొందే ఉద్యోగులను ఈ బదిలీల నుంచి మినహాయించారు. ఉద్యోగ సంఘాల నేతలకు, ఆఫీస్ బ్యారర్స్ను కూడా బదిలీల నుంచి తప్పించారు. ఫిబ్రవరి 1 నాటికి ఒకే చోట ఐదేళ్లు విధులు నిర్వహించిన ప్రతి ఉద్యోగినీ బదిలీ చేస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో మూడేళ్లు, గిరిజన ప్రాంతాల్లో రెండేళ్లు పనిచేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. రిక్వెస్ట్ ట్రాన్స్‌ఫర్స్‌కు దరఖాస్తు చేసుకున్న వారిని బలవంతంగా బదిలీ చేయడానికి లేదని పేర్కొన్నారు. దరఖాస్తు దారులు రిక్వెస్ట్ చేస్తే మినహా ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న స్థానం నుంచి బదిలీ చేయవద్దని స్పష్టం చేశారు. దివ్యాంగులు కూడా రిక్వెస్ట్ ట్రాన్స్‌ఫర్స్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. వారు దరఖాస్తు చేసుకున్న స్థానంలో ఖాళీ ఉంటేనే బదిలీకి అవకాశం కల్పిస్తారు. బదిలీల్లో దివ్యాంగులకు తొలి ప్రాధాన్యత ఇస్తారు.
స్పెషలిస్ట్ డాక్టర్లకు వారి విభాగంలో ఖాళీ ఉంటేనే బదిలీ చేస్తారు. మిస్‌మ్యాచ్ పోస్టింగ్‌లకు అవకాశం లేదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బదిలీలకు అర్హులైన ఉద్యోగులు, రిక్వెస్ట్ చేసే ఉద్యోగులు కేవలం మూడు స్థానాలను మాత్రమే ఆప్షన్‌గా ఉంచుకోవాల్సి ఉంటుంది. ఒకేస్థానాన్ని ఇద్దరు, ముగ్గురు ఉద్యోగులు దరఖాస్తు చేస్తే సినియార్టీ ఆధారంగా ట్రాన్స్ఫర్ చేస్తారు. ట్రాన్స్ఫర్ ఆర్డర్ తీసుకున్న ఉద్యోగులు కేవలం ఏడు రోజుల వ్యవధిలో వారి స్థానాల్లో చేరాల్సి ఉంటుంది. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటారు.
మొదటి ప్రాధాన్యత వీరికేదృష్టి మాంద్యం ఉన్న ఉద్యోగులకు బదిలీల్లో మొదటి ప్రాధాన్యత ఇస్తారు. ఐటీడీఏ పరిధిలోని సంస్థల్లో విధులు నిర్వహించే ఉద్యోగులకు, దివ్యాంగులకు 40 శాతంపైన వైకల్యం ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తారు. మానసిక వైకల్యం ఉన్న చిన్నారులను కలిగిన ఉద్యోగులకు, కేన్సర్‌తో బాధపడుతున్న వారికి, గుండె, మెదడు, న్యూరో ఆపరేషన్లు, కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకున్న వారు బదిలీలకు దరఖాస్తు చేస్తే వైద్య సదుపాయాలున్న ప్రదేశాల్లో బదిలీ చేసేందుకు అవకాశం కల్పిస్తారు. స్పౌజ్ గ్రౌండ్స్ ఉన్న వారికి కూడా ప్రాధాన్యత ఇవ్వనున్నారు.
బదిలీలకు ప్రత్యేక కమిటీలుడీఎంఈలో బదిలీల ప్రక్రియను నిర్వహించేందుకు ప్రభుత్వం కమిటీని వేసింది. ఈ కమిటీకి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ రాఘవేంద్రరావు చైర్మన్‌గా ఉంటారు. ఏపీవీవీపీ కమిషనర్, డీహెచ్ మెంబర్లుగా ఉంటారు. డీఎంఈ జాయింట్ డైరెక్టర్ మెంబర్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. ఏపీవీపీలో బదిలీలకు ప్రక్రియను నిర్వహించేందుకు కమిషనర్ డాక్టర్ వినోద్‌కుమార్‌ను చైర్మన్‌గా నియమించింది. డీఎంఈ, డీహెచ్ మెంబర్లుగా ఉంటారు. ఏపీవీవీపీ సెక్రటరీని మెంబర్ కన్వీనర్‌గా నియమించారు. జిల్లాల్లో బదిలీల ప్రక్రియను నిర్వహించేందుకు గ్రామ, వార్డు సచివాలయ జాయింట్ కలెక్టర్ చైర్మన్‌గా ఉంటారు.
28 రోజుల్లో పూర్తిఆరోగ్యశాఖ కమిషనర్ పరిధిలో ఉన్న ఆస్పత్రుల్లో బదిలీలకు రాష్ట్ర స్థాయి కమిటీలో ఆరోగ్యశాఖ కమిషనర్‌ను చైర్మన్‌గా నియమించారు. ఆరోగ్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ మెంబర్ కన్వీనర్‌గా, ఐపీఎం డైరెక్టర్ మెంబర్‌గా ఉంటారు. డీహెచ్ పరిధిలోని ఉద్యోగుల బదిలీలకు డీహెచ్‌ను చైర్మన్‌గా నియమించారు. ఏపీవీవీపీ కమిషనర్, డీఎంఈని మెంబర్లుగా నియమించారు. ఆయుష్ విభాగంలో కూడా బదిలీలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రస్థాయి పోస్టులకు ఆయుష్ కమిషనర్ నేతృత్వంలో కమిటీ బదిలీల ప్రక్రియను చేపడుతుంది. బదిలీల కోసం ఉద్యోగులు 7వ తేదీలోపు దరఖాస్తులు చేసుకోవాలి. 15వ తేదీ నాటికి కమిటీలు బదిలీల జాబితాను సిద్ధం చేస్తాయి. 21వ తేదీ నాటికి ట్రాన్స్ఫర్ 1ఆర్డర్లు ఇస్తాయి. 28వ తేదీలోపు ఉద్యోగులు బదిలీ చేసిన స్థానాల్లో చేరాల్సి ఉంటుంది.
0 Comments:
Post a Comment