Students who fell ill after eating adulterated food - Zadpi chairman who visited the school ... Details
కల్తీ ఆహారం తిని అస్వస్థతకు గురైన విద్యార్థినులు - పాఠశాల ని సందర్శించిన జడ్పీ చైర్మన్ ...వివరాలు
విద్యార్థుల బాధ్యత ఉపాధ్యాయులదే..
ప్రజాశక్తి-మార్టూరు రూరల్: విద్యార్థులు పాఠశాలలో ఉన్నంత వరకు వారి సంరక్షణ బాధ్యత ఉపా ధ్యాయులదేనని జిల్లాపరిషత్ చైర్మన్ బూచ ేపల్లి వెంకాయమ్మ అన్నారు.
గురువారం కల్తీ ఆహారం తిని అస్వస్థతకు గురైన విద్యార్థినులను పరామర్శించేందుకు శుక్రవారం ఆమె జడ్పీ వైస్ చైర్మన్ చుండి సుజ్ఞానమ్మతో కలిసి స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె వంట నిర్వాహకురాలితో పాటు ఎంఇఒ వస్రాంనాయక్, ప్రధానోపా ధ్యాయుడు డేవిడ్‌ను జరిగిన సంఘటనపై ఆరా తీశారు. అస్వస్థతకు గురై పాఠశాలలో ఉన్న నలుగురు విద్యార్థులను పరామర్శిం చి.. ఏమి జరిగిందని వారిని ప్రశ్నించగా సాంబారులో బల్లి పడిన మాట వాస్తవ మని, ఆ ఆహారం తినే తామంతా అస్వ స్థతకు గురైనట్లు చెప్పడంతో వాస్తవాలు వెల్లడించిన విద్యార్థినులను జడ్పీ చైర్మన్ ప్రశంసించారు. 11 వందల మంది ఉన్న పాఠశాలకు డైనింగ్ హాలు లేనందున చెట్ల కింద భోజనం చేస్తున్నారని ఉపాధ్యా యులు తెలుపగా ఆవరణలో ఆగేయంగా ఉన్న ఖాళీ స్థలాన్ని పరిశీలించి... డైనింగ్ హాలు నిర్మాణానికి రూ.5 లక్షల జడ్పీ నిధు లు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. జాతీయ రహదారికి అభిముఖంగా ఉన్న పాఠశాల స్థలంలో నాలుగు సంవత్సరాల క్రితం నిర్మించబడి రకరకాల కారణాలతో ప్రారంభోత్సవానికి నోచుకోని షాపింగ్ కాంప్లెక్స్‌ను ఆమె పరిశీలించి త్వరలో తగు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా వైస్ చైర్మన్ సుజ్ఞానమ్మ, తహశీల్దార్ వెంకటరెడ్డి, పార్టీ నాయకులు పఠాన్ కాలేషావలి తదితరులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పద్మావతి, వైద్యశాల సిబ్బంది రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరును చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. చిన్న రోగానికి కూడా ఇక్కడ వైద్య సహాయం లభించదని, ఒంగోలు, గుంటూరు ప్రభుత్వ వైద్యశాల లకు రోగులను రిఫర్ చేస్తుండటంతో ప్రజలు వ్యయప్రయాసలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆరోపించారు. ఇందుకు స్పం దించిన జడ్పీ చైర్మన్ సమస్యను జిల్లా కలె క్టర్ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. విద్యార్థులు మరోసారి అస్వస్థతకు గురయ్యే పరిస్థితి వస్తే కఠిన చర్యలు తీసుకుంటా మని హెచ్చరించారు. కార్యక్రమంలో జడ్పి సిఇఒ జాలిరెడ్డి, ఎంపిపి భుక్యా శాంతి భాయి, మార్టూరు సర్పంచి సుమితాభారు, ఎంపిడిఒ కల్లూరి సుందరరామయ్య, వైసిపి నాయకులు జ్ఞాన సుందరరావు, సులే మాన్, బాబూనాయక్, రాజానాయక్, ఉపా ధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
0 Comments:
Post a Comment