Visakhapatnam: మరో 80 ఏళ్లలో విశాఖపట్నం మన కంటికి కనిపించదు..! ఎందుకంటే..
రాబోయే తరాలు విశాఖను చూడలేవు. చూద్దామన్నా కనపడదు. ఎందుకంటే అప్పటికి ఆ నగరం సముద్ర గర్భంలో కలిసిపోతుంది. వినడానికి కఠినంగా ఉన్నా.. ఇది నమ్మక తప్పని నిజం.
రచ్చబండ మీద కూర్చున్న వాళ్లు పొద్దుపోక చెప్పుకునే కబురు కాదిది.. ఎంతో సుదీర్ఘ అధ్యయనం చేసిన తర్వాత నిపుణులు చేసిన హెచ్చరిక ఇది. ఇప్పుడు సముద్రపు కోతలు.. సముద్రంలో జరుగుతున్న పరిణామాలే దీనికి సంకేతాలు. విశాఖ సముంద్రంలో కలిసిపోతుందని జాతీయ సముద్ర విజ్ఞాన శాస్త్ర కేంద్రం, వైజాగ్ మాజీ డైరెక్టర్, సముద్ర విజ్ఞాన శాస్త్రవేత్త.. KS మూర్తి అంచనా వేస్తున్నారు. ఈ అభిప్రాయం మూర్తి ఒకరిదే కాదు.. సుమారు 4 దశాబ్దాలపాటు పరిశోధనలు చేసిన ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ కూడా ఇదే హెచ్చరిక చేస్తోంది.
ఈ మధ్య కాలంలోనే ఐపీసీసీ తీవ్ర హెచ్చరికలు కూడా చేసింది. గ్లోబల్ వార్మింగ్‌తో పాటు ఇతర కాలుష్యాల వల్ల దేశంలో ఊహించని విధంగా వాతావరణ మార్పులు చోటుచేసుకోనున్నాయని తెలిపింది. సముద్రపు జలాలు భారీ స్థాయిలో పెరిగిపోయి.. దేశంలోని 12 కీలక తీరప్రాంత పట్టణాలు మునిగిపోతాయని హెచ్చరించింది. ఇందుకు సంబంధించి ఓ నివేదిక వచ్చింది. ఆ నివేదికలో ఉన్న పేర్లలో విశాఖ సిటీ కూడా ఉంది.
ఒక వేల సముద్రం ఎంత మేర ముందుకు వస్తే.. విశాఖలో ఏయే ప్రాంతాలు మునిగిపోతాయో ఓ సారి చూద్దాం. ఇప్పటికిప్పుడు దానివల్ల వచ్చిన ప్రమాదం ఏమీ లేదు.. కానీ ఈ శతాబ్దపు చివరి నాటికి. అంటే మరో 80 ఏళ్లలో సముద్ర గర్భంలో విశాఖ చేరిపోయే ప్రమాదం ఉంది. సాధారణంగా ప్రతీ ఏటా సముద్ర జలాల ఎత్తు 0.2 సెంటీమీటర్ల ఎత్తు నుంచి 0.5 సెంటీమీటర్ల ఎత్తువరకు పెరిగే అవకాశం ఉంటుంది. కానీ ఈ మధ్యకాలంలో 0.6 సెంటీమీటర్ల మేర పెరుగుతున్నాయి. మున్ముందు.. 1 నుంచి 2 సెంటీమీటర్ల వరకు పెరిగే అవకాశం ఉందనే సంకేతాలు వినిపిస్తున్నాయి. ఈ లెక్కన రాబోయే 80 ఏళ్లకు కనీసం 80 సెంటీమీటర్ల నుంచి 160 సెంటీమీటర్లు సముద్రం పెరుగుతుంది. అంత మేర సముద్రం తన తీరాన్ని విస్తరించుకుంటే తీర ప్రాంత నగరాలు దాదాపు మునిగిపోతాయి.
ఎందుకంటే.. గ్లోబల్ రేటు కంటే ఆసియాలోనే సముద్రపు మట్టాల పెరుగుదల ఎక్కువగా కనిపిస్తోందని ఐపీసీసీ తెలిపింది. గత వందేళ్లలో చూడని విధంగా సముద్రపు మట్టాల్లో మార్పులు చోటు చేసుకున్నాయని ఐపీసీసీ నివేదిక వెల్లడిస్తోంది. 2050 తర్వాత నుంచి మరింత వేగంగా సముద్ర మట్టాలు పెరుగుతాయనేది నిపుణులు అంచనా వేస్తున్నారు.
గ్లోబల్ వార్మింగ్.. ఇతర కాలుష్య కారకాలతో పాటు అనేక అంశాలు సముద్ర జలాలను ప్రభావితం చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా మంచు పర్వతాలు కరిగిపోవడం దీనికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. ఉష్ణోగ్రతలు పెరగడం, మంచు కరగడం, వాతావరణ మార్పులతో మరో 80 ఏళ్లలో మూడు ఫీట్ల మేర సముద్ర మట్టం పెరిగే అవకాశం ఉంది. ఈ లెక్కన ముంబై, మంగళూరు, కొచ్చిన్, పారాదీప్, ఖిదీర్‌పూర్, విశాఖపట్నం, చెన్నై, ట్యూటికోరిన్ లాంటి 12 నగరాలు సముద్రగర్భంలోకి వెళ్లనున్నాయి.
Don't worry, vizag sea level ki height lonay vundi mumbai, Chennai cities tho compare cheste. Vizag munigite, major coastal cities chala potayi world lo
ReplyDeleteDon't say kanipunchadu.Add "kanipinchadata". It may not be possible also.In 80 years so many things happens. You may get extra land in Vizag if water level come down
ReplyDelete