300 నిమిషాల పాటు ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో పనిచేయవు: ఎస్బిఐ
న్యూఢిల్లీ : నిర్వహణా పరమైన పనులు చేపడుతున్న కారణంగా రేపు (శనివారం) కొన్ని గంటలపాటు ఆన్లైన్ సేవలు నిలిపివేస్తున్నట్టు ఎస్బిఐ(స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) ప్రకటించింది.
ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో, యోనో లైట్, యుపిఐ లాంటివి పనిచేయవు. నిర్దిష్ట కాలానికి ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలను ఉపయోగించలేరు. మరోవైపు బ్యాంక్‌కు రెండో శనివారం, ఆదివారం వారం సెలవుదినం కూడా ఉన్నాయి. దీని వల్ల వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉన్న కారణంగా ముందస్తుగా బ్యాంక్ హెచ్చరికలు చేసింది.
300 నిమిషాల పాటు ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో, యోనో లైట్, యుపిఐ వంటి వివిధ సౌకర్యాలను ఉపయోగించలేరని తెలిపింది. ఎస్బిఐ తన అధికారిక ట్విట్టర్ అకౌంట్లో ఈ ప్రకటన చేసింది. ఉన్నతమైన బ్యాంకింగ్ అనుభవాన్ని అందించడానికి ప్రయత్నిస్తున్నందున గౌరవనీయమైన కస్టమర్లు తమకు సహకరించగలరని బ్యాంక్ కోరింది. 'మేము 11 డిసెంబర్ రాత్రి 11:30 నుండి తెల్లవారు జామున 4:30 (300 నిమిషాలు) వరకు టెక్నాలజీ అప్‌గ్రేడేషన్ పనిని చేపట్టనున్నాం. ఈ సమయంలో ఐఎన్‌బి, యోనో, యోనో లైట్, యోనో బిజినెస్, యుపిఐ అందుబాటులో ఉండవు. మేము అసౌకర్యానికి చింతిస్తున్నాం. మాకు సహకరించగలరని అభ్యర్థిస్తున్నాం' అని ట్విట్టర్ ద్వారా ఎస్బిఐ వెల్లడించింది.
0 Comments:
Post a Comment