✍జీతం రివర్స్ - ఉద్యోగులకు షాక్
♦పీఆర్సీతో జీతం పెంపు కాదు... తగ్గింపు
♦తెరపైకి సీఎస్ కమిటీ సిఫారసులు
♦అవి అమలైతే జీతానికి భారీగా కోత
♦ఫిట్మెంట్ 14.29 శాతం చాలు!
♦కేంద్ర ఉద్యోగులకు ఇచ్చింది అంతే
♦హెచ్ఆర్ఏ గరిష్ఠంగా 16 శాతమే
♦11 నెలల తర్వాతే పీఆర్సీ అమలు
♦అప్పటిదాకా ఇప్పుడున్న వేతనాలే
♦ఆ తర్వాత... పెరగవు, తగ్గుతాయి
♦ఒక్కో ఉద్యోగికి 10వేలకుపైగా కోత
♦సెక్రటేరియట్, హెచ్వోడీ సిబ్బందికి వాత
♦వేతనాల్లోనూ సర్కారు ‘రివర్స్’ టెండరింగ్
♦పెరగదు! ఇప్పుడొస్తున్న దానికంటే భారీగా తగ్గుతుంది.
🔺‘ఫిట్మెంట్ ఎంతిస్తారు? జీతం ఎంత పెరుగుతుంది? పీఆర్సీ ఎప్పటి నుంచి అమలు చేస్తారు?’.... ఇలా చర్చోపచర్చలు సాగిస్తున్న ఉద్యోగులకు సీఎస్ నేతృత్వంలోని కార్యదర్శుల కమిటీ గట్టి షాకులు ఇచ్చింది. ‘అబ్బే... వీళ్లకు ఇప్పుడు ఇస్తున్న జీతభత్యాలే ఎక్కువ. అంత అవసరంలేదు. తగ్గించేద్దాం’ అని సర్కారుకు సిఫారసు చేసింది. అసలు పీఆర్సీ నివేదికను గుట్టుగా దాచేసిన రాష్ట్ర ప్రభుత్వం... వ్యూహాత్మకంగా సీఎస్ కమిటీ నివేదికను బయటపెట్టింది. ఆ కమిటీ సిఫారసులు అమలైతే... ఉద్యోగుల జీతాలు పెరగడం కాదు, భారీగా తగ్గుతాయి.
♦ఫిట్మెంట్ 14.29 శాతం చాలు
రాష్ట్ర విభజన తర్వాత ఆర్థిక కష్టాలు వెంటాడుతున్నప్పటికీ... చంద్రబాబు సర్కారు 43 శాతం ఫిట్మెంట్ ఇచ్చింది. ఇప్పుడు పీఆర్సీ కమిషన్ 27 శాతం సిఫారసు చేసిందంటూనే... 14.29 శాతం ఇస్తే చాలు అని సీఎస్ కమిటీ పరోక్షంగా తేల్చింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 7వ సీపీసీ పదేళ్లకు 14.29 శాతం ఫిట్మెంట్ ఇచ్చిందని తెలిపింది. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇంతే ఇచ్చాయని పేర్కొంది. కానీ... ఈ పదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రెండు విడతల్లో కలిపి ఏకంగా 82 శాతం ఫిట్మెంట్ లభించిందని... ఇది చాలా ఎక్కువని అభిప్రాయపడింది. సీఎస్ కమిటీ సిఫారసు ప్రకారం... ఫిట్మెంట్ 14.29 శాతం చేస్తే, ఒక్కొక్కరి మూలవేతనంలో 12.71 శాతం తగ్గుతుందన్న మాట!
♦హెచ్ఆర్ఏకు కోత...
ఫిట్మెంట్కు ఎసరు పెట్టిన సీఎస్ కమిటీ... హెర్ఆర్ఏలోనూ భారీ మతలబులు చేసింది. ప్రస్తుతం... ఉద్యోగులు నివసిస్తున్న నగరాల జనాభా ప్రాతిపదికన 10 శాతం, 20 శాతం, 30 శాతం హెచ్ఆర్ఏ అమలవుతోంది. సెక్రటేరియట్, హెచ్వోడీ ఉద్యోగులందరికీ 30 శాతం హెచ్ఆర్ఏ వస్తోంది. ‘అంత అవసరం లేదు’ అని సీఎస్ కమిటీ అభిప్రాయపడింది. ‘‘రాష్ట్ర విభజన తర్వాత... హైదరాబాద్ నుంచి ఏపీకి వచ్చిన ప్రభుత్వ ఉద్యోగులకు తాత్కాలిక చర్యగా 30 శాతం హెచ్ఆర్ఏను, పరిమిత కాలానికి మాత్రమే అందించాలని నిర్ణయించినట్లు గుర్తించాం. ఉద్యోగులు అమరావతికి వచ్చి ఆరేళ్ల తర్వాత కూడా దీనిని కొనసాగించడం సహేతుకం కాదు. 30 శాతం హెచ్ఆర్ఏను నిలిపివేయాలి’’ అని తెలిపింది. 5లక్షల నుంచి 50 లక్షల వరకు జనాభా ఉన్న నగరాల్లో నివసించే ఉద్యోగులందరికీ 16 శాతం హెచ్ఆర్ఏ ఇవ్వాలని సిఫారసు చేసింది. 5 లక్షల్లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో నివసించే వారికి 8 శాతం హెచ్ఆర్ఏ ఇవ్వాలని సూచించింది. ఇక... 50 లక్షలకు మించిన జనాభా ఉన్న నగరాల్లో నివసించే వారికి 24 శాతం హెచ్ఆర్ఏ ఇవ్వాలని తెలిపింది. అసలు విషయం ఏమిటంటే... మన రాష్ట్రంలో 50 లక్షల జనాభా ఉన్న నగరం ఒక్కటీ లేదు. ఏతావాతా తేలేదేమిటంటే... సీఎస్ కమిటీ సిఫారసులు అమలు చేస్తే సచివాలయం, హెచ్వోడీ ఉద్యోగుల హెచ్ఆర్ఏ 30 శాతం నుంచి ఒకేసారి 16కు తగ్గుతుంది. ఇక... కొన్ని జిల్లా కేంద్రాల్లో పని చేస్తున్న ఉద్యోగులకు ఇప్పుడు అందుతున్న 20 శాతం హెచ్ఆర్ఏ కూడా 4 శాతం తగ్గి, 16కు చేరుతుంది. మండల, గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఇప్పుడు 12.5 శాతం హెచ్ఆర్ఏ అందుతోంది. సీఎస్ కమిటీ సిఫారసుల ప్రకారం... 5 లక్షలలోపు జనాభా ఉన్న అన్ని ప్రాంతాలు/పట్టణాల్లోని ఉద్యోగులకు 8 శాతం హెచ్ఆర్ఏ మాత్రమే అమలవుతుంది. అందరికీ... పల్లె నుంచి రాజధాని అమరావతి దాకా పనిచేస్తున్న ఉద్యోగులందరికీ హెచ్ఆర్ఏలో కోత పడుతుంది!
♦సీసీఏ ఎత్తివేత
నగరాల్లో పనిచేసే ఉద్యోగులకు ఇచ్చే ఉద్యోగులకు సిటీ కంపెన్సేటరీ అలవెన్సు (సీసీఏ) అందుతోంది. విజయవాడ, విశాఖ నగరాల్లో పనిచేసే వారికి రూ.400, ఇతర మునిసిపాలిటీల్లోని ఉద్యోగులకు రూ.300 సీసీఏగా అందుతోంది. దీనిని... రూ.వెయ్యి, రూ.700లకు పెంచాలని అశుతోష్ మిశ్రా కమిషన్ సూచించింది. కానీ... సీఎస్ కమిటీ మాత్రం అసలు సీసీఏ అక్కర్లేదని తేల్చేసింది. దానిని పూర్తిగా ఎత్తేసింది.
♦‘రికవరీ చెయ్యం’... అదే మీకు రక్ష
ఈ పీఆర్సీని 2018 నుంచి అమలు చేయాలి. సీఎస్ కమిటీ సిఫారసుల ప్రకారం చూస్తే... ఈ మూడేళ్లుగా ఉద్యోగులు ఎక్కువ జీతాలు తీసుకుంటున్నారన్న మాట! ఆ మొత్తాన్ని ప్రభుత్వం రికవరీ చేయాలి. కానీ... ‘రికవరీ నుంచి రక్షణ కల్పిస్తున్నాం. మీరు ఎక్కువ తీసుకున్న జీతాన్ని వెనక్కి తీసుకోం! ఊపిరి పీల్చుకోండి’ అంటూ సీఎస్ కమిటీ పెద్ద ఉపశమనం కల్పించింది. అంతేకాదు... కొత్త పీఆర్సీని 11 నెలల తర్వాత అమలు చేయాలని సూచించింది. అంటే... 2022 అక్టోబరు 31వ తేదీ వరకు ఉద్యోగులకు ఇవే జీతాలు అందుతాయి. ఆ తర్వాత... పెరగవు! తగ్గుతాయి!
కేంద్రం అనుసరించిన విధానాల ప్రకారమే రాష్ట్రంలో కూడా పీఆర్సీ అమలు చేస్తున్నామని చెబుతున్నప్పటికీ... కేంద్ర ఉద్యోగుల వేతనాలే ఎక్కువగా ఉంటున్నాయి.
ఇళ్లు, వాహనాలు, పర్సనల్ కంప్యూటర్ల కొనుగోలు కోసం ఇచ్చే లోన్లను ఇప్పటి వరకు ప్రభుత్వం ఇచ్చేది. ఇకపై బ్యాంకులతో టైఅప్ అయి తీసుకోవాలని... 2.5 శాతం వడ్డీ రాయితీ ఇవ్వాలని మిశ్రా కమిషన్ సిఫారసు చేసింది. దీనిని సీఎస్ కమిటీ యథాతథంగా ఆమోదించింది.
మహిళా ఉపాధ్యాయుల తరహాలో ప్రభుత్వ రంగంలోని ఇతర మహిళా ఉద్యోగులకు కూడా ఏడాదిలో అదనంగా 5 రోజుల క్యాజువల్ లీవులు ఇవ్వాలని నిర్ణయించారు.
*పీఆర్సీ కమిషన్ చెప్పిందిదీ..
*ప్రభుత్వం 11వ పీఆర్సీ నివేదికను బయట పెట్టలేదు*. కానీ... సీఎస్ కమిటీ తన నివేదికలోనే పీఆర్సీ నివేదికలోని కొన్ని అంశాలను ప్రస్తావించింది.
అందులో కొన్ని ముఖ్యాంశాలు...
*ఫిట్మెంట్ 27 శాతం ఇవ్వాలి
*కనీస వేతనం 20 వేలు
*మాస్టర్ స్కేలులో గరిష్ఠ వేతనం 1.79 లక్షలు
*ఇంక్రిమెంట్ తొలిదశలో 3 శాతం, చివరిలో 2.34 శాతం
* 1-7-2018 నుంచి కొత్త వేతనాలు ఇవ్వాలి*
ఆర్థిక లబ్ధి ఎప్పటి నుంచి అనేది ప్రభుత్వ నిర్ణయానికే
10 లక్షల జనాభా దాకా ఉన్న నగరాల్లోని ఉద్యోగులకు హెచ్ఆర్ఏ 20 నుంచి 22 శాతానికి పెంపు
రిటైర్డ్ ఉద్యోగుల గ్రాట్యుటీ 12 లక్షల నుంచి 16 లక్షలకు పెంపు
ప్రభుత్వ ఉద్యోగులారా... జాగ్రత్తగా వినండి! ‘ఇప్పుడున్న జీతాలు పెంచకపోయినా ఫర్వాలేదు. తగ్గించవద్దు మహా ప్రభూ!’ అని జగనన్నను వేడుకోండి!
‘2022 నవంబరు గండం’ నుంచి గట్టెక్కడం గురించి ఆలోచించండి! ఇప్పుడు వస్తున్న జీతం డబ్బులను జాగ్రత్తగా దాచుకోండి. ఎందుకంటే... సీఎస్ కమిటీ సిఫారసులను అమలు చేస్తే, ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు తగ్గిపోతాయి. ఇప్పుడు వచ్చే హెచ్ఆర్ఏ రాదు. ఇప్పుడు వస్తున్న సిటీ కన్వేయన్స్ అలవెన్స్ అందదు. ఇప్పుడు వస్తున్న ఐఆర్ 27 శాతం మాయమై, 14.29 శాతం ఫిట్మెంట్ మాత్రమే మిగులుతుంది. వెరసి... ఒక్కో ఉద్యోగి జీతం కనీసం 10 వేలు తగ్గుతుంది. రాష్ట్ర సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయ ఉద్యోగులకు మరింత కోత పడుతుంది!
Covid19 kasta kalamlo maa prananiki panamga petti panichesthunnamu, yenta kasta padi chesina, Gurthinpu ledu. Yevaraina PRC prakaram jithalu penchutharu, kani nivvu padiveyyulu thaggitai antunnavu,present retlu thaggatu jithalu ivvali kani thaggipotundi antunnavu,yemi prabhuvtam idi.. . .Ravali Jagan Kavali Jagan ante Eda.. Pani, Unemployed jobs levu, amithisavu cheppu, samayam asanna mavuthundi rendu samvasralu unnai. Prajalu, nirudyogulu, udyogalu, karmikulu usuru thaguluthundi, Unna jithalu thagginchaku,alage Ivvu lekapothe Road meda andaru yekkutharu. .. Government
ReplyDeleteఆ రైతు పడుతున్న బాధ, పొలంలో వరి, కుప్ప నూర్పులో లో, గాలిపంక తగిలి ప్రమాదం జరిగితే ఆ రైతుకు ప్రధమ చికిత్స, చేయాలనీ , పెట్టాలి.ఏ వార్త , ఎలా పెట్టాలో , తెలియదు, నేరాలు గోరాలు, అంటే సినిమాలు, సీరియల్స్ ఉంటాయి.మాస్ జర్నలిసుమ్ చేసినవాలు మాత్రమే.రీపోటర్స్ ఉండాలి.
ReplyDeleteకాంట్రాక్టు, ఔట్సోఅర్చింగ్, ఉద్యోగాలు సంగతి ఏంటి ... ఎప్పుడు రెగ్యులర్ చేస్తావు చెప్పు, ఉన్న జీతాలు , తగ్గితను అంటున్నావు .. ఇదేనా నీ పద్ధతి...! కొరోనా కష్ట కాలంలో, ప్రాణానికి ఫణంగా పెట్టి , లెక్క చేయకుండా పనిచేస్తున్నారు.ఒక ప్లానింగ్ ఉండదు, నిబద్దత ఉండదు.ఒక వెనిజులా, దేశం అయ్యింది.మాన రాష్టంరాష్టం,....?
ReplyDelete