✍పీఆర్సీపై పిలుపు
♦ఉద్యోగ సంఘాలతో నేడు మరో విడత చర్చలు
♦ఆర్థిక శాఖ నుంచి ఆహ్వానం
♦ఫిట్మెంట్ పై తుది నిర్ణయానికి అవకాశం
♦నేడో రేపోముఖ్యమంత్రితో సమావేశం
🌻అమరావతి, ఆంధ్రప్రభ: వేతన సవరణ సిఫార్సులపై ప్రభుత్వం కసరత్తు పూర్తిచేసినట్లు విశ్వసనీయసమాచారం ఉద్యోగ సంఘాలతో గతంలో జరిగిన సమావేశాల వివరాలను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారు. లు ముఖ్యమంత్రికి వివరిస్తున్నారు. అటు ఉద్యోగులు, ఇటు ప్రభుత్వం పై భారం పడకుండా సమతుల్యం గా ఉండేలా ప్రతిపాదనలతో రావాల ని ముఖ్యమంత్రి ఆదేశించిన నేపథ్యంలో.. బుధవారం ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సమీర్ శర్మ నేతృత్వంలోని కమిటీ భేటీ అవుతుందని భావించారు. అయితే సచివాలయం, సీఎం.. క్యాంప్ కార్యాలయంలో పీఆర్పీపై ఎలాంటి సమావేశాలు జరగలేదని చెప్తున్నారు. మరో చోటు సమావేశమై ఉండవచ్చనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈ సమావేశంలోనే సీఆర్‌పై తంది నిర్ణయం తీసుకుని ఉద్యోగులకు వివరించే ప్రయత్నం చేయాలని భావించినట్లు సమాచారం. పీటర్ తో పాటు ఇతర డిమాండ్లపై చర్చిం చేందుకు గురువారం మధ్యాహ్నం 2 గంటలకు సవాలయంలోని ఆర్థిక శాఖ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించే సమావేశానికి హాజరు కావాల్సిందిగా ఉద్యోగ సంఘాలకు పిలుపు వచ్చింది. దీంతో నూతన సంవత్సర కానుకగా వీఆరేసీ ప్రకటిస్తారనే ఆశలు. ఉద్యోగవర్గాల్లో చిగురిస్తున్నాయి. గత కొద్దిరోజుల క్రితం ముఖ్యమంత్రి సమక్షంలో జరిగిన చర్చల్లో పై ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఆర్థికశాఖకు బాధ్యతలు అప్పగించడంతో.. పాటు సీఎంఓ కార్యాలయంలో ఓ సమన్వయ అధికారిని నియమించాలని ముఖ్యమంత్రి ఆదేశించిన సంగతి విదితమే. దీంతో ఈ సారి నేరుగా ఆర్థిక శాఖ నుంచే పిలుపు వచ్చినట్లు చెప అన్నారు. ప్రభుత్వపరంగా ఉన్నతాధికారులు, ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ముఖ్యమంత్రితో తరచు భేటీ అయి ప్రతిపాదనలపై పలు దఫాలుగా ఇప్పటికే చర్చించారు. మరోవైపు రోజుకో సారి జేఏసీల ఆధ్వర్యంలోని స్ట్రగుల్ కమిటీ సమావేశాలు నిర్వహించి భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తోంది. ఉద్యోగుల ఆందోళనకు సంబంధించి వేగుల వ్యవస్థ ఎప్పటికప్పుడు సమాచారాన్ని ముఖ్యమంత్రి కార్యాలయానికి అందజేస్తోంది. ఇక జాప్యం చేయకూడదని ప్రభుత్వం, అలస్యం తగదని జేఏసీలు భావిస్తున్నాయి. ముఖ్యమంత్రితో భేటీ సందర్భంగానే తమ సమస్యలు పరిష్కారం కాగలవని జేఏసీ నేతలు తేల్చి చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆర్థికశాఖ ఉన్నతాధికారులతో సమావేశం ఏ రకంగా ఉంటుందనేది చర్చనీయాంశంగా మారింది. మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డితో ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ భేటీలోనే పీఆరీపై ఓ నిర్ణయానికి వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. ఉద్యోగులు నష్టపోకుండా ఒకింత మెరుగైన వేతనాలనే అందించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకు సంబంధించి తగిన ప్రతిపాదనలతో రావాలని ముఖ్యమంత్రి ఆర్థికశాఖను ఆదేశించిన నేపథ్యంలో నేడు జరిగే సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. పిట్మంట్ 14.29 శాతంతో పాటు డీఏలు మొత్తంగా ఎంత శాతం ప్రకటిస్తారనే విషయమై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఐఆర్ 27 శాతం ఇప్పటికే అమల్లో ఉన్నందున అందుకు తగ్గట్టుగా ఫిట్మెంట్ ఇవ్వటం సాధ్యపడదని
ఆర్థికశాఖ స్పష్టం చేస్తున్నట్లు తెలిసింది. దీంతో ఫిట్మెంట్ప సందిగ్ధత నెలకొంది. కాగా ఆర్థికశాఖతో జరిగే సమావేశంలో పీఆర్సీపై చర్చిస్తారా లేక గతం నుంచి ఉన్న రూ.1600 కోట్ల బకాయిలతో పాటు మెడికల్ రే యింబర్స్‌మెంట్ తదితర అంశాలపై నిర్ణయిస్తారా అనేది తేలాల్సి ఉంది. వీఆర్ సీపై ఆర్థికశాఖ జరిపే చర్చలు సఫలీకృతమైతే అదేరోజు ముఖ్యమంత్రి ఉద్యోగ నేతలతో భేటీ అయి ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రకటించే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. గురు, శుక్ర వారాల్లో స్పష్టతనివ్వాలని అధికారులు తీవ్ర కసరత్తు జరుపుతున్నారు. ఈ రెండు రోజుల్లో సమస్య పరిష్కారం కాకపోతే మరో వారానికి కానీ ముఖ్యమంత్రితో చర్చలకు అవకాశం ఉండదు. సజ్జలకు కంటి శస్త్ర చికిత్స చేయాలని వైద్యులు సిఫార్సు చేయటంతో పాటు నాలుగు రోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు తెలిసింది. జనవరి ఒకటో తేదీన ముఖ్యమంత్రి గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో పింఛన్ల పెంపు కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని బట్టి ఈ నెల 3వ తేదీన జరిగే సెక్రటేరియట్ సమావేశంలో మరో విడత ఆందోళనకు అల్టిమేటం జారీ చేసేందుకు స్ట్రగుల్ కమిటీ సమాయత్తమవుతోంది.
♦14.29 శాతం పీఆర్సీ శోచనీయం
💥ఏపీ జేఏసీ అధ్యక్షుడు ఖండి
🌻అమరావతి, ఆంధ్రప్రభ: అధికారులిచ్చిన 14.29 శాతం పీఆర్సీ శోచనీయమని ఏపీ పఏసీ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు అన్నారు. సీఎం జగన్ 27 శాతం పీఆర్సీ ఇస్తానంటే అధికారులు 14.29 శాతానికే నివేదిక ఇవ్వడాన్ని తిరస్కరించామని ఆయన చెప్పారు. అశోక్ మిశ్రా వేదికగా అమలు చేయాలన్నారు. ఉద్యోగులకు 2018 లై 1 నుంచి 55 శాతం ఫిట్మెంట్ అమలు చేయాలని కోరారు. సీపీఎస్ రద్దు చేస్తామన్న సీఎం హామీని నిలబెట్టుకోవాలని, కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని బండి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.
*All the member Associations of the AP Joint Staff Council* are requested to *attend a meeting on PRC only with the Finance Department* ( chaired by the Prl.Secretary , Finance Dept.) at the following *timings on 30.12.2021* at the *Finance Conference Hall, 2nd Block, 1st floor ,AP Secretariat*.
I) *Time*: *2.30 PM*
1) APNGOs Association
2) AP Revenue Services Association
3) State Teachers’ Union,AP.(STU)
4) AP Teachers‘Federation (APTF)
5) AP United Teachers’Federation(UTF)
6) AP Co-Operative Service Association
7) AP Live Stock Service Association
8) AP Treasury Services Association
9) AP Class-4 Employees Association .
II) *Time: 3.30 PM*
10) AP Secretariat Association
11) AP Treasury Services Association
12) AP Survey Employees Association
13) AP State Typists and Stenographers Association.
*Time: 4.30 PM*
14) AP Govt. Employees Association (APGEA)
15) AP Commercial Taxes Non-Gazetted Officers’ Association
16) *Progressive Recognized Teachers’ Union AP- Regd no. 197/18 (PRTUAP)*.
Thank you,
*Shashi Bhushan Kumar*, IAS
*Prl Secy, Fin ( HR )*
0 Comments:
Post a Comment