పీఆర్సీపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కీలక ప్రకటన..
పీఆర్సీపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కీలక ప్రకటన చేశారు. తిరుపతి సరస్వతీ నగర్లో ఉద్యోగుల తరపున కొందరు ప్రతినిధులు సీఎం జగన్ను కలిసి పీఆర్సీపై విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా పీఆర్సీ ప్రక్రియ పూర్తయిందని, పదిరోజుల్లో ప్రకటన చేస్తామని సీఎం జగన్ అన్నారు. ఈ మేరకు ఉద్యోగ సంఘాలకు హామీ ఇచ్చారు.
ఈ రోజున పిఆర్సి పై చర్చించేందుకు కౌన్సిల్లో ఉన్న సంఘాలకు మధ్యాహ్నం రెండు గంటలకు మీటింగ్ నిర్వహించనున్నారు. ఈ మీటింగు కు ముందే ముఖ్యమంత్రి గారు ఇలాంటి ప్రకటన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
0 Comments:
Post a Comment