AP CM YS Jagan Review on PRC: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు రెండు, మూడు రోజుల్లో శుభవార్త చెప్పేందుకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధమయ్యారు.
ఈ మేరకు ఇవాళ తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఆర్థిక శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ(పీఆర్సీ) ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటికే పీఆర్సీ సాధన కోసం సంఘాలు కార్యచరణ కూడా ప్రకటించాయి. ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకునేందుకు సైతం సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో పీఆర్సీపై సీఎం జగన్ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. వేతన సవరణకు సంబంధించి కమిటీ ఇచ్చిన నివేదికపై సీఎం సుదీర్ఘంగా చర్చించారు.
పీఆర్సీ సవరణ కమిటీ సిఫార్సులను పరిశీలించిన సీఎం.. ఎంతమేరకు పెంచాలన్న దానిపై ఆర్థిక శాఖ ఉన్నతాధికారుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. అయితే, కొత్త సవరణ ప్రకారం 34 శాతం ఫిట్మెంట్ ఇచ్చే అవకాశం ఉందంటూ ఉద్యోగుల వాట్సాప్ గ్రూప్ల్లో సందేశాలు వైరల్ అవుతున్నాయి. పీఆర్సీపై ప్రభుత్వ నిర్ణయం సోమవారం ప్రకటించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఏళ్ల తరబడి ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించకపోవడంతో ఉద్యోగుల్లో అసంతృప్తి పెల్లుబుకుతోంది.
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వా త ఉద్యోగులకు సంబంధించిన ఆర్థిక, ఆర్థికేతర సమస్యలు ఏ ఒక్కటీ పరిష్కరించకపోవడంతో ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి పీఆర్సీతో సహా ఉద్యోగుల సమస్యలన్నీ తక్షణమే ప్రభుత్వం పరిష్కరించాలంటూ ఉద్యమ కార్యాచరణకు పిలుపునిచ్చాయి. జేఏసీలు ఇచ్చిన ఐక్య ఉద్యమ కార్యాచరణకు పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు నిరసన కార్యాక్రమాల్లో పాల్గొంటున్నారు. నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతున్నారు. ఉద్యోగులతో పాటు విశ్రాంత ఉద్యోగులు ఉద్యమానికి ఊతం ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి జగన్.. ఇవాళ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. సీపీఎస్ రద్దు, గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది, కాంట్రాక్ట్ ఉద్యోగులను సర్వీసులను పర్మినెంట్ చేయడం.. వంటి కీలక అంశాలపైన సీఎం చర్చించినట్లు సమాచారం.
CM JAGAN REVIEW ON PRC: ఆర్థికశాఖ ఉన్నతాధికారులతో సీఎం సమావేశం..ఫిట్మెంట్ ఖరారు చేసే అవకాశం
CM Jagan on PRC : తాడేపల్లిలో ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి జగన్ సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణపై కమిటీ ఇచ్చిన నివేదికపై సంబంధిత అధికారులతో సీఎం చర్చలు జరుపుతున్నారు. కమిటీ సిఫార్సులు పరిశీలించి, వేతనాల పెంపుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
CM Jagan on PRC : ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో సీఎం వైఎస్ జగన్ సమావేశమయ్యారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరుగుతున్న సమావేశంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సవరణ అంశంపై అధికారులతో ముఖ్యమంత్రి చర్చిస్తున్నారు. ఉద్యోగుల వేతన సవరణపై కమిటీ ఇచ్చిన నివేదికపై సీఎం చర్చలు జరుపుతున్నారు. కమిటీ సిఫార్సులను పరిశీలించి ఎంత మేర వేతనాలు పెంచాలనే అంశంపై సీఎం సమీక్షిస్తున్నారు. ఉద్యోగుల మిగిలిన సమస్యల పరిష్కారంపైనా సీఎం దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది.
సీపీఎస్ రద్దు, గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది సర్వీసులను శాశ్వతం చేయడం, కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీసుల క్రమబద్ధీకరణ తదితర డిమాండ్లు సైతం పరిష్కరిస్తే బడ్జెట్ పై ఎంత భారం పడుతుందనే విషయమై సమాలోచనలు చేస్తున్నారు. పదిరోజుల్లో పీఆర్సీ ప్రకటిస్తానని ఈనెల 3న తిరుపతిలో ఉద్యోగులకు సీఎం హామీ ఇచ్చారు. డిమాండ్ల సాధన కోసం కొద్ది రోజులుగా ఉద్యోగులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తుండటంతో ఇవాళ సీఎం సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఇవాళ్టీ సమావేశంలో ఫిట్మెంట్ను ఖరారు చేసే అవకాశం ఉందని తెలిసింది. పీఆర్సీపై సీఎం కీలక ప్రకటన చేసే అవకాశాలున్నట్లు తెలిసింది.మా డిమాండ్లను పరిష్కరించండి...Bopparaju On Employees Protest: ప్రభుత్వం దృష్టికి 71 డిమాండ్లు తీసుకెళ్లామని ఏపీ జేఏసీ ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. 13 లక్షల మంది డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఉద్యోగ సంఘ నేతలతో కలిసి కడపలో మీడియా సమావేశంలో మాట్లాడారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం నుంచి ఇంతవరకు సానుకూల స్పందన రాలేదన్నారు.ఉద్యమ కార్యాచరణ సిద్ధం చేస్తున్నామన్న ఆయన.. 11వ పీఆర్సీ అమలు చేయాలనేదే తమ ప్రధాన డిమాండ్ అని స్పష్టం చేశారు. ఎప్పటికప్పుడు ఇస్తామంటూ 7 డీఏలు పెండింగ్లో ఉంచారని ఆరోపించారు. వైకాపా ప్రభుత్వం రాగానే సీపీఎస్ రద్దు చేస్తామని జగన్ చెప్పారని గుర్తు చేశారు.
'ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ కూడా పెండింగ్లో ఉంది. వైద్య ఖర్చుల రీయంబర్స్మెంట్ జరగడం లేదు. మా సమస్య వినే స్థితిలో ప్రభుత్వం లేదు. అందుకే రోడ్లపైకి వచ్చాం. రేపట్నుంచి ఉద్యమ కార్యాచరణ, ప్రతి ఉద్యోగీ నల్ల బ్యాడ్జీ ధరించాలి. ఈ నెల 16 న అన్ని కార్యాలయాల వద్ద ధర్నాలు చేపట్టాలి. ప్రభుత్వం దిగిరాకుంటే రెండోదశలో ఉద్యమం తీవ్రం. 2 ఐకాసలు ఇచ్చిన 71 డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలి'- బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ జేఏసీ ఛైర్మన్
0 Comments:
Post a Comment