Mobile Charging - మొబైల్ స్పీడ్ గా ఛార్జింగ్ ఎక్కాలంటే ఇలా చేయండి..
ఎంత అప్డేటెడ్ వెర్షన్ స్మార్ట్ ఫోన్ అయినా ఛార్జింగ్ మాత్రం కంపల్సరీ. అయితే.. ఫుల్ ఛార్జింగ్ పెట్టినా సాయంత్రం కల్లా మళ్లీ బ్యాటరీ లో అవుతుంది.
ఇలాంటప్పుడు వెంటనే మళ్లీ మొబైల్ బ్యాటరీ నిండాలంటే ఛార్జింగ్ స్పీడ్ గా ఎక్కాలి. ఈ మధ్య వచ్చిన మొబైల్స్ లో ఫాస్ట్ ఛార్జింగ్ మోడ్ అందుబాటులో ఉన్నా.. మిగతా ఫోన్లలో లేదు. అయితే చార్జింగ్ స్పీడ్ పెంచుకోవడానికి ఈ టిప్స్ పాటిస్తే మేలు అంటున్నారు నిపుణులు.
ఛార్జింగ్ పెట్టినప్పుడు మొబైల్‌ని అస్సలు ఉపయోగించకూడదు. కాల్స్ మాట్లాడటం, గేమ్స్ ఆడటం వంటివి అస్సలు చేయొద్దు. ఇలా చేస్తే బ్యాటరీ దెబ్బతినడంతో పాటు.. ఛార్జింగ్ వేగం కూడా తగ్గుతుంది.
బ్లూటూత్, వైఫై ఆన్ లో ఉండటం వల్ల బ్యాటరీ ఎక్కువ అవసరం అవుతుంది. అవసరం లేనప్పుడు వాటి సర్వీసులను ఆఫ్ లో ఉంచడం వల్ల బ్యాటరీ ఆదా చేయొచ్చు. ఛార్జింగ్ పెట్టినప్పుడు బ్లూటూత్, వైఫై అస్సలు ఆన్ లో ఉంచకండి.
వీలైనంత వరకు మొబైల్ ఛార్జింగ్ పెట్టడానికి అదే కంపెనీకి చెందిన ఒరిజినల్ కేబుల్, అడాప్టర్‌ను మాత్రమే వాడండి. కంపెనీ బ్రాండ్ కాకుండా వేరేవి వాడితే బ్యాటరీ దెబ్బతింటుంది. ఛార్జింగ్ వేగం కూడా తగ్గుతుంది.
మొబైల్ ఆపరేట్ చేసేటప్పుడు వాడిన కొన్ని యాప్స్ బ్యాక్ గ్రౌండ్ లో కూడా రన్ అవుతూ ఉంటాయి. అలా బ్యాటరీ చాలావరకు ఖర్చైపోతుంది. బ్యాటరీ ఛార్జింగ్ కూడా లేట్ గా అవుతుంది. అందుకే ఛార్జింగ్ పెట్టినప్పుడు బ్యాక్ గ్రౌండ్ యాప్స్ ని కూడా ఆపేయాలి.
మొబైల్‌ని ఫ్లైట్ మోడ్‌లో ఉంచి ఛార్జింగ్ పెడితే.. ఫోన్ వేగంగా ఛార్జ్ అవుతుంది. నెట్వర్క్ నుంచి డిస్కనెక్ట్ అయి ఉండటం వల్ల బ్యాటరీ కూడా ఆదా అవుతుంది.
మొబైల్ ని రాత్రంతా ఛార్జింగ్ పెట్టడ్ కరెక్ట్ కాదు. ఇలా చేయడం వల్ల లాంగ్‌రన్‌లో బ్యాటరీ పనితీరు మందగిస్తుంది.
0 Comments:
Post a Comment