LIC Scholarship: విద్యార్థులకు ఎల్ఐసీ నుంచి స్కాలర్షిప్... దరఖాస్తు లింక్ ఇదే
స్కాలర్షిప్ పొందాలనుకునే విద్యార్థులకు గుడ్ న్యూస్. ఇన్స్యూరెన్స్ రంగ దిగ్గజం అయిన లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) స్కాలర్షిప్ స్కీమ్ ప్రకటించింది.
ఎల్ఐసీ గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్-2021 ద్వారా విద్యార్థులకు ఆర్థిక ప్రోత్సాహాన్ని అందిస్తోంది. ఆర్థికంగా వెనుకబడ్డ విద్యార్థులు ఉన్నత విద్య కోసం ఈ స్కాలర్షిప్ (Scholarship) పొందొచ్చు. ప్రతిభ ఉన్న విద్యార్థులు ఉన్నత విద్య అభ్యసించడానికి ఆర్థిక సమస్యలు అడ్డుగా నిలవకూడదన్న కారణంతో ఎల్ఐసీ ప్రతీ ఏటా స్కాలర్షిప్స్ అందిస్తున్న సంగతి తెలిసిందే. భారతదేశంలోని ఏదైనా కాలేజ్ లేదా విశ్వవిద్యాలయంలో కోర్సులు చేసే విద్యార్థులు ఈ స్కాలర్షిప్ పొందొచ్చు.
ఎల్ఐసీ గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్-2021 అర్హతలు
ఎల్ఐసీ గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్-2021 అర్హతలు చూస్తే విద్యార్థులు 2020-21 విద్యా సంవత్సరంలో కనీసం 60 శాతం మార్కులతో టెన్త్ లేదా 12వ తరగతి లేదా ఇంటర్మీడియట్ పాస్ కావాలి. విద్యార్థుల తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.2,00,000 లోపు ఉండాలి. గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుంచి ఇంటర్మీడియట్, మెడిసిన్, ఇంజనీరింగ్, ఇతర డిగ్రీ కోర్సులు, ఇంటిగ్రేటెడ్ కోర్సులు, డిప్లొమా కోర్సులు, వొకేషనల్ కోర్సులు చదవడానికి స్కాలర్షిప్ పొందొచ్చు.
ఎల్ఐసీ గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్-2021 వివరాలు
ఎల్ఐసీ గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్-2021 స్కీమ్‌కు ఎంపికైన విద్యార్థులకు వార్షికంగా రూ.Rs.20,000 స్కాలర్షిప్ లభిస్తుంది. కోర్సు పూర్తయ్యేవరకు ప్రతీ ఏటా స్కాలర్షిప్ పొందొచ్చు. మూడేళ్ల కోర్సుకు మూడు వాయిదాలు స్కాలర్షిప్ అందిస్తుంది ఎల్ఐసీ. ఇక స్పెషల్ గాళ్ చైల్డ్ కేటగిరీలో ఎంపికైన విద్యార్థినులకు 10+2 కోర్సు చదవడానికి ఏటా రూ.10,000 చొప్పున స్కాలర్షిప్ లభిస్తుంది. స్కాలర్షిప్ మొత్తం విద్యార్థి బ్యాంక్ అకౌంట్లోకి నేరుగా జమ అవుతుంది.
ఎల్ఐసీ గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్-2021 నిబంధనలు
ఈ స్కాలర్షిప్ 60 శాతం పైగా మార్కులు సాధించిన విద్యార్థులకు మాత్రమే లభిస్తుంది. అది కూడా తల్లిదండ్రులు, సంరక్షకుల వార్షికాదాయం రూ.2,00,000 లోపు ఉండాలి. అయితే కరోనా వైరస్ మహమ్మారి కారణంగా తల్లిదండ్రుల్ని లేదా కుటుంబ పోషకుల్ని కోల్పోయినవారి పిల్లలు, తండ్రి లేకుండా తల్లి పెంపకంలో ఉన్న పిల్లల విషయంలోనూ వార్షికాదాయం నిబంధన రూ.4,00,000 లోపు ఉండొచ్చని ఎల్ఐసీ ప్రకటించింది.
ఎల్ఐసీ గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్-2021 దరఖాస్తు విధానం
Step 1- విద్యార్థులు ఎల్ఐసీ అధికారిక వెబ్సైట్ https://licindia.in/ లో స్కాలర్షిప్కు అప్లై చేయాలి.
Step 2- ఈ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత GJF Scholarship Scheme 2021 లింక్ పైన క్లిక్ చేయాలి. లేదా నేరుగా ఇక్కడ క్లిక్ చేయండి.
Step 3- విద్యార్థి పేరు, పుట్టిన తేదీ, అడ్రస్, విద్యార్హతలు ఎంటర్ చేయాలి.
Step 4- బ్యాంక్ అకౌంట్ వివరాలు, ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి.
Step 5- అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేసి భద్రపర్చుకోవాలి.
0 Comments:
Post a Comment