Jio Best Plans: ఆఫర్లతో దుమ్ములేపుతున్న జియో.. ఏకంగా రూ.152కే అన్ లిమిటెడ్ బెనిఫిట్స్.. ప్లాన్ల వివరాలివే
తాజాగా, రిలయన్స్ జియో ప్లాన్ ధరలను పెంచింది.
అయితే ,కొన్ని ఆఫర్లను ప్రకటించడం ద్వారా వినియోగదారుల భారాన్ని కూడా తగ్గించింది జియో. ఇప్పుడు Jio ఫోన్ వినియోగదారుల కోసం కొన్ని ప్లాన్లను తీసుకువచ్చింది జియో. ఈ ప్లాన్ల ద్వారా తక్కువ ధరకు అనేక ప్రయోజనాలను అందిస్తోంది. ఆ ప్లాన్ల వివరాలు ఇలా ఉన్నాయి.
Jio Rs. 152 Plan: ఈ ప్లాన్‌ను స్వీకరించే జియో ఫోన్ వినియోగదారులు రోజుకు 0.5 GB డేటా లభిస్తుంది. అన్ లిమిటెడ్ కాలింగ్ సదుపాయం లభిస్తుంది. అదనంగా 300 SMSలు ఉచితంగా లభిస్తాయి. ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజులు.
Jio Rs. 186 Plan: ఈ ప్లాన్‌తో రోజుకు 1GB డేటా, అపరిమిత కాలింగ్ సౌకర్యం లభిస్తుంది. రోజుకు 100 SMSలు పంపించుకోవచ్చు. అదనంగా, ఈ ప్లాన్ ద్వారా జియో యాప్ యాక్సెస్ లభిస్తుంది. ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజులు.
Jio Rs.75 Plan: జియో నుంచి అత్యంత తక్కువ ధరకు లభించే ప్లాన్ ఇది. ఈ ప్లాన్ ఎంచుకున్న వినియోగదారులకు 3జీబీ డేటా లభిస్తుంది. అంటే రోజుకు 0.1జీబీ వాడుకోవచ్చు. అదనంగా 200 MB డేటా లభిస్తుంది. అపరిమిత కాలింగ్ లభిస్తుంది. 23 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది.
Jio Rs 91 Plan: ఈ ప్లాన్ ఎంచుకున్న వినియోగదారులకు అన్ లిమిటెడ్ కాలింగ్ సదుపాయం లభిస్తుంది. 3జీబీ డేటా(0.1GB/Day). అదనంగా 200MB డేటా లభిస్తుంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు.
0 Comments:
Post a Comment