నిన్న పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి, కమీషనర్, రాష్ట్ర పథక సంచాలకుల & అడ్వైజర్, ఇన్ఫ్రా వారు SCERT లో నిర్వహించిన JDs, DEOs and APCల సమీక్షా సమావేశంలోని ముఖ్యంశాలు.
సమావేశంలోని ముఖ్యంశాలు.
3,4&5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో వీలీనం సందర్భంగా ఉపాధ్యాయుల సర్దుబాటు (1:20 & 1: 30)
ఏ యాజమాన్య పాఠశాలను అదే యాజమాన్య పాఠశాలలోకి మాత్రమే కలపాలి.
ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలలను ప్రస్తుతానికి మెర్జింగ్ ప్రక్రియ కు పరిగణించవద్దు.
ఒక కిలోమీటరు లోపు వేరే మండలం పాఠశాల వున్నా యాజమాన్యం ఒకటే అయితే తరగతులను కలపలచ్చు.
20 కన్నా తక్కువ స్ట్రంక్త్ వున్న ప్రాథమిక పాఠశాలలను మెర్జింగ్ కు పరిగణలోకి తీసుకోరు
100 కన్నా తక్కువ స్ట్రంక్త్ వున్న ఉన్నత పాఠశాలలోకి వేరే ప్రాంతం నుంచి అనగా 1 కిలోమీటరు లోపు వున్న 3,4&5 తరగతులు కలపకూడదు
అదేవిధంగా 1000 కన్నా ఎక్కువ స్ట్రంక్త్ వున్న ఉన్నత పాఠశాలలోకి వేరే ప్రాంతం నుంచి అనగా 1 కిలోమీటరు లోపు వున్న 3,4&5 తరగతులు కలపకూడదు
బాలికల పాఠశాలలోకి కూడా
వేరే ప్రాంతం నుంచి అనగా 1 కిలోమీటరు లోపు వున్న 3,4&5 తరగతులు కలపకూడదు.
20 కన్నా తక్కువ 40 లోపు స్ట్రంక్త్ వున్న ప్రాథమిక పాఠశాలలకు ఒక తరగతి గది మాత్రమే పరిగణించబడును
41 నుంచి 100 లోపు 2 తరగతి గదులను పరిగణనలోకి తీసుకోబడును.
100 స్ట్రంక్త్ పైన వున్న ప్రాథమిక పాఠశాలలకు మాత్రమే తరగతికి ఒక గది సూత్రం వర్తిస్తుంది.
జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీ కి సంబంధించి ఏ పిల్లలకైతే కిట్ల పంపిణీ చేయలేదు దానికి గల కారణాలను నూతన వెర్షన్ APP లో పొందుపరచడానికి ఆప్షన్ ఇచ్చారు. తక్షణమే ప్రధానోపాధ్యాయులందరు ఆ ఆప్షన్ లో సదరు విద్యార్థుల సమాచారాన్ని అప్లోడ్ చేయాలి.
మండలాల్లో మిగిలిన జెవికె కిట్లను తక్షణమే DPO కార్యాలయం నుంచి రాష్ట్ర కార్యాలయానికి తరలించాలి.
నిష్ఠా 2, 3 లో ఉపాధ్యాయులు అందరి నమోదు తప్పనిసరి
PFMS అకౌంటెంట్ల నెంబర్లు త్వరితగతిన పాఠశాలలకు వచ్చేలా బ్యాంకు మేనేజర్లతో సంప్రదింపులు జరపాలి.
పాఠశాలల పిసి ఖాతాల్లో వున్న నిధులను తక్షణమే వినియోగించాలి. ఖాతాల్లో వుంచరాదు.
జిల్లా కార్యాలయానికి జమచేయవలసిన పెండింగ్ అడ్వాన్సులను తక్షణమే చెల్లించాలి లేదా సంబంధిత ఖర్చుల UC లు మరియు బిల్లులు సమర్పించాలి.
కోవిడ్ - 19 లో తల్లిదండ్రులను కోల్పోయిన బాలబాలికల వివరాలు తక్షణమే సమర్పించాలి.
జిల్లా పథక సంచాలకుల కార్యాలయంలో పెండింగ్ లో వున్న అన్ని బిల్లులను ఫైల్స్ ను అత్యంత త్వరితగతిన క్లియర్ చేయాలి.
మండలాల్లోని వున్న ఉన్నత పాఠశాలల్లోని అటల్టింకరింగ్ ల్యాబ్ లన్నీ వినియోగంలో ఉన్నాయో లేదో సమీక్షించి నివేదిక సమర్పించాలి.
నాడు-నేడు మొదటి విడత పాఠశాలల ప్రోజెక్టులను క్లోజ్ చేసాక పనులన్నీ పూర్తి అయి వుండాలి అసంపూర్తిగా వున్నచో సంబంధిత ప్రధానోపాధ్యాయులపై చర్యలు తీసుకోబడును.
WE LOVE READING క్రమం తప్పకుండా నిర్వహించాలి.
FA1 మార్కుల పోస్టింగ్ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయవలె.
స్టూడెంట్ ఇన్ఫో లో మేపింగ్ ప్రక్రియ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తక్షణమే పూర్తి చేయవలెను.
ReplyDeleteWorship God but Respect Human first
,,,,,,,,Dr:BR AMBEDKAR