Helath Tips - బాన పొట్టను తగ్గించే ఈ సూపర్ డ్రింక్‌ను తాగండి...
ఇటీవల రోజుల్లో ఎక్కడ చూసినా బాన పొట్ట బాధితులే దర్శనమిస్తున్నారు. ఆహారపు అలవాట్లు, జీవన శైలిలో మార్పులు, శారీరక శ్రమ లేకపోవడం, ఎక్కువ సమయం పాటు కూర్చుని ఉండటం, మద్యపానం అలవాటు ఇలా రకరకాల కారణాల వల్ల నాజూగ్గా ఉండాల్సిన పొట్ట బానలా తయారు అవుతుంది.
ఇక పెరిగితే పెరిగిందే అని బాన పొట్టను పొరపాటున నిర్లక్ష్యం చేశారా.. ఇక గుండె జబ్బులు, మధుమేహం, కొన్ని రకాల క్యాన్సర్లు రావటానికీ దోహదం అవుతుంది. అందుకే బొజ్జను తగ్గించుకోవటానికి నానా ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే ఇప్పుడు చెప్పబోయే సూపర్ డ్రింక్‌ను ప్రతి రోజు తీసుకుంటే గనుక కేవలం కొద్ది రోజుల్లోనే బాన పొట్టకు బై బై చెప్పేయవచ్చు. మరి ఆలస్యం చేయకుండా ఆ సూపర్ డ్రింక్ ఏంటీ..? దానిని ఎలా తయారు చేయాలి..? ఎప్పుడు తీసుకోవాలి..? వంటి విషయాలుపై ఓ లుక్కేసేయండి. ముందుగా ఒక క్యాబేజ్‌ను తీసుకుని ముక్కలుగా కట్ చేసి నీటిలో కడగాలి. ఇప్పుడు మిక్సీ జార్లో క్యాబేజ్ ముక్కలను మెత్తగా గ్రౌండ్ చేసి పేస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్‌పై ఒక గిన్నె పెట్టుకుని అందులో రెండు గ్లాసుల వాటర్, క్యాబేజ్ పేస్ట్, రెండు నిమ్మ చెక్కలు, నాలుగు లవంగాలు, దంచిన చిన్న అల్లం ముక్క వేసి పది నుంచి పది హేను నిమిషాల పాటు హీట్ చేయాలి.
ఆనై వాటర్‌ను ఫిల్టర్ చేసుకుని.. గోరు వెచ్చగా అయిన తర్వాత తేనె కలిపి పరగడుపున తీసుకోవాలి. ఇలా డ్రింక్‌ను రెగ్యులర్‌గా తీసుకుంటే పొట్ట దగ్గర ఉన్న కొవ్వంతా కరిగి పోతుంది. పలితంగా బాన పొట్ట కాస్త సన్నజాజి తీగలా మారుతుంది. పైగా ఈ డ్రింక్‌ను సేవించడం వల్ల శరీరంలో ఉన్న మలినాలన్నీ బయటకు పోయి అంతర్గత అవయవాలు శుభ్ర పడతాయి.
0 Comments:
Post a Comment