Health: ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకుంటున్నారా.? అయితే ఈ శ్వాస వ్యాయామం తప్పక చేయాల్సిందే..
Health: ఇటీవలి కాలంలో వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోంది. దీని కారణంగా మానవ అవయవాల్లో ప్రధానంగా ప్రభావం పడేది ఊపిరితిత్తులపైనే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఇక కరోనా మహమ్మారి కూడా శ్వాస వ్యవస్థపై తీవ్రంగా ప్రభావం చూపుతుందని, ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని కూడా నిపుణులు చెబుతూనే ఉన్నారు. కరోనా సోకిన వారు వాసనను కోల్పోవడమే దీనికి ఉదాహరణ చెప్పవచ్చు.
అంతేకాకుండా పొగాకు కూడా ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే శ్వాస వ్యాయామం చేయడం వల్ల ఊపిరితిత్తులను శుభ్రం చేసుకోవచ్చని మీకు తెలుసా.? ఇందకోసం ఒక సింపుల్ వ్యాయామం అందుబాటులో ఉంది. ఇంతకీ ఆ వ్యాయామాన్ని ఎలా చేయాలో తెలుసుకుందాం..
* ఇందుకోసం ముందుగా నేలపై వెల్లకిలా పడుకోవాలి.
* అనంతరం రెండు అర చేతులను పొట్టపై పెట్టుకోవాలి.
* తర్వాత రెండు కళ్లు మూసుకొని ప్రశాంతంగా ముక్కు ద్వారా శ్వాసను పీలుస్తూ 5 వరకు లెక్కబెట్టాలి.
* ఇలా గుండెల నిండా శ్వాసను తీసుకొని రెండు సెకన్ల పాటు శ్వాసను బిగపట్టి ఉంచాలి. తరువాత శ్వాసను నెమ్మదిగా వదులుతూ మళ్లీ 5 వరకు లెక్కించాలి.
* ఈ వ్యాయామాన్ని ఉదయాన్నే పరగడుపున 10 సార్లు చేయాలి. క్రమం తప్పుకుండా ఇలా చేస్తే మంచి ఫలితం లభిస్తుంది.
ఇక కేవలం శ్వాస సంబంధిత వ్యాయామమే కాకుండా తీసుకునే ఆహారం కూడా ఊపిరితిత్తులను శుభ్రం చేస్తుందని మీకు తెలుసా.? ఊపిరితిత్తులు నిత్యం శుభ్రంగా ఉండాలంటే.. ఉదయం నిద్రలేవగానే రెండు టీస్పూన్ల అల్లం రసం తీసుకోవాలి. ఇలా చేస్తే లంగ్స్ హెల్తీగా మారుతాయి. అలాగే పుదీనా ఆకులను నీళ్లలో వేసి మరిగించి రోజూ నీటి రూపంలో తీసుకుంటే ఊపిరితిత్తులు శుభ్రమవుతాయి.
0 Comments:
Post a Comment