Harnaaz Sandhu: మిస్ యూనివర్స్‌గా భారత యువతి హర్నాజ్ సంధు
ఇజ్రాయెల్: భారత మగువల అందం మరోసారి విశ్వవ్యాప్తమైంది. విశ్వసుందరి కిరీటం కోసం 21 ఏళ్లు కొనసాగిన నిరీక్షణకు ఎట్టకేలకు అందమైన ముగింపు లభించింది. అందంతో పాటు తెలివితేటలకూ పరీక్ష పెట్టే మిస్ యునివర్స్-2021 పోటీల్లో భారత యువతి హర్నాజ్ సంధు విజేతగా నిలిచింది. 80 దేశాల నుంచి వచ్చిన అందగత్తెలను వెనక్కి నెట్టి కిరీటాన్ని కైవసం చేసుకుంది. గతంలో ఈ ఘనతను సాధించిన సుస్మితా సేన్(1994), లారా దత్తా(2000)ల సరసన చేరింది. తన అందంతో పాటు పదునైన సందేశం, తెలివైన సమాధానాలతో అందరినీ అబ్బురపరిచింది.
హర్నాజ్ సంధు పంజాబీ ప్రాంతానికి చెందిన అమ్మాయి. మోడలింగ్, వెండితెరపై ఆసక్తితో ఆమె విద్యార్థి దశలోనే ఫ్యాషన్ రంగం వైపు అడుగులు వేశారు. మోడలింగ్‌లో రాణించడంతోపాటు పలు పంజాబీ చిత్రాల్లోనూ నటించారు. సోషల్‌మీడియాలోనూ ఆమెకు ఎక్కువమంది ఫాలోవర్స్ ఉన్నారు.
Harnaaz Sandhu: అవమానాలు ఎదుర్కొని.. విశ్వ వేదికపై గెలిచి..!
విశ్వ సుందరి హర్నాజ్ కౌర్ సంధు గురించి ఆసక్తికర విశేషాలు
ఇంటర్నెట్‌డెస్క్: ‘‘నువ్వు సన్నగా, పీలగా ఉంటావు’’, ‘‘మరీ అంత అందగత్తెవేమీ కాదు’’ ఇలా తనకు ఎదురైన అవమానాలు, విమర్శలను మెట్లుగా మార్చుకొని ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి.. నేడు విశ్వ వేదికగా విజేతగా నిలిచారు హర్నాజ్ కౌర్ సంధు. పంజాబీ రాష్ట్రంలోని చండీగఢ్ ప్రాంతానికి చెందిన ఈ 21 ఏళ్ల చిన్నది.. 21 సంవత్సరాల తర్వాత భారత్‌కు విశ్వసుందరి కిరీటాన్ని తీసుకువచ్చారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరూ ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు..
చిన్నప్పుడే మోడలింగ్..
హర్నాజ్ సంధుకు చిన్నతనం నుంచి మోడలింగ్ అంటే ఆసక్తి. నటిగా వెండితెరపై రాణించాలని ఆమె ఎన్నో కలలు కనేది. ఆ కలలను సాకారం చేసుకోవడానికి విద్యార్థి దశ నుంచే మోడలింగ్‌లో శిక్షణ తీసుకున్నారు. మోడల్‌గా ఎన్నో వేదికలపై మెరిశారు. ఈ క్రమంలోనే అందాల పోటీల్లో పాల్గొని ‘లివా మిస్ దివా యూనివర్స్’ కిరీటాన్ని దక్కించుకున్నారు. తనకు అంది వచ్చిన ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకుంటూ విశ్వ సుందరి పోటీల్లోకి అడుగుపెట్టారు. 80 దేశాలకు చెందిన అందగత్తెలను వెనక్కి నెట్టి విశ్వ వేదికపై విజయకేతనం ఎగురవేశారు. మరోవైపు, హర్నాజ్ కేవలం మోడల్ మాత్రమే కాదు నటి కూడా. పంజాబీలో తెరకెక్కిన పలు సినిమాల్లో నటించారు.
అమ్మే స్ఫూర్తి....
హర్నాజ్ తల్లి ఫేమస్ గైనకాలజిస్ట్. ప్రతి విషయంలో అమ్మ నుంచే స్ఫూర్తి పొందానని హర్నాజ్ ఎప్పుడూ చెబుతుంటారు. అమ్మే తనకు నిజమైన రోల్ మోడల్ అని అంటుంటారు. మోడలింగ్ కెరీర్లోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నప్పుడు అమ్మే తనకు మార్గదర్శకం చేసిందని.. వెన్ను తట్టి ప్రోత్సహించిందని హర్నాజ్ ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు.
అవమానాలు ఎదుర్కొని...
శారీరాకృతి విషయంలో టీనేజీలో తాను ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని హర్నాజ్ పలు వేదికలపై చెప్పారు. ‘‘నువ్వు చూడటానికి సన్నగా ఉంటావు’’, ‘‘నీ శరీరం ఎందుకు అలా ఉంది’’ అంటూ పలువురు తనపై విమర్శలు చేశారని.. కాకపోతే, ఆ విమర్శలన్నింటినీ ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొని.. ధైర్యంగా ముందడుగు వేశానని ఆమె అన్నారు.
హర్నాజ్‌కు కిరీటం తెచ్చిపెట్టిన ప్రశ్న ఇదే..
ఒత్తిళ్లు ఎదుర్కోవడంలో ప్రస్తుతం ఉన్న యువతకు మీరు ఇచ్చే సలహా ఏమిటి?
హర్నాజ్: ఆత్మవిశ్వాసం లేకపోవడమే నేటి తరం యువత ఎదుర్కొంటోన్న అతిపెద్ద సమస్య. మిమ్మల్ని మీరు ఎదుటి వాళ్లతో పోల్చుకోవడం ఇకనైనా ఆపండి. ప్రపంచవ్యాప్తంగా జరుగుతోన్న ఎన్నో విషయాల గురించి మాట్లాడండి. మీ జీవితానికి మీరే లీడర్.. కాబట్టి మీకోసం మీరు గళమెత్తండి. నాపై నాకు పూర్తి నమ్మకం ఉంది. అందుకే నేను ఈరోజు ఈ వేదికపై ఉన్నాను. (అని హర్నాజ్ చెప్పడంతో వేదిక వద్ద ఉన్న ప్రేక్షకులందరూ ఒక్కసారిగా చప్పట్లతో అభినందనలు తెలిపారు)
1. హర్నాజ్ వయసు 21 సంవత్సరాలు
2. ప్రస్తుతం ఆమె పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో పీజీ చేస్తున్నారు.
3. స్త్రీ విద్య, మహిళా సాధికారతకు ఆమె మద్దతిస్తున్నారు.
4. హర్నాజ్ ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉంటారు. 2014లో ఫిబ్రవరి 14న ఆమె ఇన్‌స్టాలోకి అడుగుపెట్టారు.
5. ట్రావెలింగ్, స్నేహితులతో సరదాగా కాలక్షేపం చేయడమంటే ఎంతో ఆసక్తి.
6.ఫిట్నెస్ విషయంలో ఎంతో శ్రద్ధ చూపిస్తుంటారు. వర్కౌట్లు మాత్రమే కాకుండా గుర్రపు స్వారీ, స్విమ్మింగ్, యోగా చేస్తుంటారు.
7. ప్రియమైన వారికి వంట చేసి పెట్టడమంటే ఇష్టం. సమయం దొరికినప్పుడు వంట గదిలోకి వెళ్లి గరిట తిప్పుతుంటారు ఈ భామ.
8. డ్యాన్స్ విషయంలోనూ ఆమె సూపరే.
0 Comments:
Post a Comment