Flipkart 2021 Year End Sale: ప్రారంభమైన ఇయర్ ఎండ్ సేల్.. వాటిపై భారీ డిస్కౌంట్లు.. ఈ ఆఫర్లు రెండు రోజులే...
మరికొద్ది రోజుల్లో 2021 ఏడాదికి గుడ్‌బై చెప్పి 2022 కొత్త ఏడాదికి అడుగుపెట్టబోతున్నాం.
ఈ నేపథ్యంలో ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఇయర్ ఎండ్ సేల్ ప్రకటించింది. ఈ సేల్‌లో యాపిల్, ఒప్పో, రియల్మీ వంటి ప్రముఖ బ్రాండ్లకు చెందిన స్మార్ట్ఫోన్లపై అదిరిపోయే డీల్స్ ప్రకటించింది.
ఈ డీల్స్‌తో పాటు అదనంగా బ్యాంక్ ఆఫర్లను కూడా అందిస్తోంది. ఈ సేల్‌లో కస్టమర్లు ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, నో-కాస్ట్ ఈఎంఐ, ఫ్లిప్‌కార్ట్ స్మార్ట్ అప్‌గ్రేడ్ వంటివి పొందవచ్చు. ఇప్పటికే ప్రారంభమైన సేల్ ఈవెంట్ డిసెంబర్ 30 వరకు కొనసాగుతుంది. ఈ సేల్‌లో స్మార్ట్ఫోన్లపై అందిస్తున్న అద్భుతమైన ఆఫర్లపై ఓలుక్కేయండి.
ఐఫోన్ 12 మినీ..
ఫ్లిప్‌కార్ట్ ఇయర్ ఎండ్ సేల్‌లో యాపిల్ ఐఫోన్ 12 మినీ 64 జీబీ వేరియంట్‌ను రూ. 41,119 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. ఇందులో 5.4 అంగుళాల డిస్ప్లే, 5జీ సపోర్ట్, యాపిల్ ఏ14 బయోనిక్ చిప్సెట్, వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ వంటివి అందించింది.
మోటరోలా ఎడ్జ్ 20 ఫ్యూజన్
ఫ్లిప్‌కార్ట్ ఇయర్ ఎండ్ సేల్‌లో మోటరోలా ఎడ్జ్ 20 ఫ్యూజన్‌ని రూ. 20,999 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. ఇది 6.67- అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే, 108 మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరాలు, 5,000mAh బ్యాటరీతో వస్తుంది.
వివో ఎక్స్70 ప్రో
ఫ్లిప్‌కార్ట్ ఇయర్ ఎండ్ సేల్‌లో వివో ఎక్స్70 ప్రో బేస్ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ. 46,990 ధర వద్ద లభిస్తుంది. ఇది క్వాడ్ రియర్ కెమెరాలు, 6.56 అంగుళాల ఫుల్-హెచ్డి ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 1200 చిప్సెట్తో పనిచేస్తుంది. ఇది 4,450mAh బ్యాటరీతో వస్తుంది. ఈ ఫోన్లో అధునాతన కెమెరా సెన్సార్లను చేర్చింది.
ఒప్పో రెనో 6 5జీ
ఫ్లిప్‌కార్ట్ ఇయర్ ఎండ్ సేల్‌లో ఒప్పో రెనో 6 5జీపై అధిరిపోయే ఆఫర్ ప్రకటించింది. సేల్ సమయంలో దీన్ని కేవలం రూ. 29,990 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 900 చిప్సెట్తో పనిచేస్తుంది. 6.43 -అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. దీనిలో ట్రిపుల్ రియర్ కెమెరాలు సెటప్‌ను అందించింది. 65W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది.
రియల్మీ జీటీ మాస్టర్ ఎడిషన్
రియల్మీ స్మార్ట్‌ఫోన్ ప్రియులు సేల్ సమయంలో రూ. 1,000 డిస్కౌంట్‌తో రియల్మీ జీటీ మాస్టర్ ఎడిషన్‌ను కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ రూ.25,999 ధర వద్ద లభిస్తుంది. ఇది 6.43- అంగుళాల ఫుల్-హెచ్డీ ప్లస్ డిస్ప్లే, ట్రిపుల్ రియర్ కెమెరాలు, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 778G చిప్సెట్తో పనిచేస్తుంది.
ఎంఐ 11 లైట్
ఫ్లిప్‌కార్ట్ ఇయర్ ఎండ్ సేల్‌లో ఎంఐ 11 లైట్‌ని కేవలం రూ. 21,999 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 732G SoC ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 6.55-అంగుళాల ఫుల్ హెచ్‌డీప్లస్ డిస్ప్లేతో వస్తుంది. దీనిలో 4,250mAh బ్యాటరీ, ట్రిపుల్ వెనుక కెమెరాలను అందించింది.
0 Comments:
Post a Comment