Do you know why the Christmas tree is so decorated with stars?
క్రిస్మస్ ట్రీని అలా స్టార్స్‌తో ఎందుకు అలంకరిస్తారో తెలుసా?
క్రిస్మస్ రోజున ఇంటి ముందు స్టార్స్‌తో అలంకరించిన క్రిస్మస్ ట్రీ తప్పనిసరిగా పెడుతుంటారు. మరి క్రిస్మస్ ట్రీని అలా స్టార్స్‌తో ఎందుకు అలంకరిస్తారో తెలుసా?
దాని వెనుక ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. ''యేసు ఈ భూమ్మీద జన్మించినప్పుడు చెట్లన్నీ బాగా ఫలించి, పండ్లతో అలంకరించుకుని సంబరాలు చేసుకున్నాయట. పక్షులు, పుష్పాలు కూడా అలంకరించుకుని క్రీస్తూ చుట్టూ తిరుగుతూ సంతోషంగా గడుపుతూ ఉండగా, అది చూసి నక్షత్రాలు కూడా భూమిపైకి వచ్చి వెలుగులు పంచాయట. కానీ క్రిస్మస్ ట్రీ మాత్రం ఒక మూల దిగులుతో ఉందట. అది గమనించిన నక్షత్రాలు, క్రిస్మస్ ట్రీ దగ్గరకు వెళ్లి 'ఎందుకని దిగులుగా ఉన్నావు?' అని ప్రశ్నించాయట. అప్పుడు క్రిస్మస్ ట్రీ ''ఆ చెట్లకేమో పండ్లు ఉన్నాయి. ఈ మొక్కలకేమో పువ్వులున్నాయి. అవి వాటితో చక్కగా అలంకరించుకొని అందంగా తయారయ్యాయి. మరి నేనేమో ఏ ఫలానికి, పుష్పానికి నోచుకోని అభాగ్యురాలిని, అందుకే దిగులుతో ఉన్నా!'' అని చెప్పిందట. దాంతో నక్షత్రాలన్నీ జాలిపడి, ఏ ప్రత్యేకత లేని ఆ చెట్టును తమ అందముతో, తేజస్సుతో నింపి యేసు ముందుకు తీసుకొని వచ్చాయట. అక్కడ ఉన్న చెట్లు, మొక్కలు, నక్షత్రాల మధ్య ఆ క్రిస్మస్ ట్రీ ఎంతో ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచిందట. అప్పటి నుంచి క్రిస్మస్ ట్రీని నక్షత్రాలతో అలంకరించడం సంప్రదాయంగా మారిందట.
0 Comments:
Post a Comment