CM YS Jagan Birthday: డిసెంబర్ 21న ‘సచివాలయ’ దినోత్సవం
సీఎం జగన్ వల్లే ఒకేసారి లక్షలాది మందికి ప్రభుత్వ ఉద్యోగాలు
కృతజ్ఞతగా ఆయన పుట్టినరోజున ఉత్సవాలు.. ఉద్యోగులంతా పాల్గొనాలి
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి పిలుపు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఓ కొత్త వ్యవస్థను ఏర్పాటు చేసి ఒకేసారి 1.34 లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలిచ్చిన సీఎం వైఎస్ జగన్కు కృతజ్ఞతగా.. ఆయన పుట్టినరోజైన డిసెంబర్ 21న గ్రామ, వార్డు సచివాలయ దినోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆ ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షుడు కాకర్ల వెంకట్రామిరెడ్డి తెలిపారు. గతేడాది కూడా రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నామని, ఈసారి మరింత ఉత్సాహంతో వేడుకలు నిర్వహించాలని ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు.
సచివాలయాల సిబ్బంది అందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. సచివాలయ ఉద్యోగులెవ్వరూ ప్రొబేషన్ డిక్లరేషన్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి స్పష్టమైన ఆదేశాలిచ్చిందని చెప్పారు. కొత్త పీఆర్సీ కూడా వర్తిస్తుందని అధికారులు తెలియజేశారని పేర్కొన్నారు.
JAC Vallu kotha high drama PRC inka thelakamunde Contract and out sourcing vallanu rechagottina JAC nethalu sehbash jac annallara mee high dramalu ika aapandi already mee valana employees PRC nastapoyaru yelano thelusa jac's sommu chesukunnaruga nethala meeda employees ki nammakam poyindi adee kakunda contract and outsourcing vallanu rechagodithe veellu kuda tagilaru ika nenu yemi cheyalenu prasthutaniki nenu ichina fitment saripettukondi ani chethulu yethesthundi ee prabhutvam chavandi yenchukunnaruga gorumudda thinipisthadu
ReplyDelete