ఏపీలో ఓవైపు పీఆర్సీ పీఠముడి వీడలేదు. ఇంతలోనే మా సంగతి ఏంటంటూ తెరమీదకు వచ్చారు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు. జేఏసీగా ఏర్పడి 24 డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచేందుకు సిద్దం చేశారు.
పీఆర్సీ విషయంలో ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య చర్చలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఐఆర్ విషయంలో ఉద్యోగ సంఘాల నేతలు అసంతృప్తిగా ఉన్నారు. ఈ క్రమంలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు జేఏసీ రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం జరిగింది. ఇందులో ప్రభుత్వం ముందు పెట్టాల్సిన డిమాండ్లను సిద్దం చేశారు. సమాన పనికి సమాన వేతనం, కనీస వేతనం రూ. 26 వేలు, అర్హత ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ వంటి డిమాండ్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది అనే ఆసక్తి సర్వత్రా నెలకొని ఉంది.
Sommu chesukunnandu valane silent aypoina nethalu
ReplyDelete