భార్య స్థానంలో విధులకు హాజరై దొరికిపోయిన టీచర్
భార్య సస్పెన్షన్..భర్తపై చర్యలకు సిఫారసు
నిర్లక్ష్యంగా ఉన్న మరో ఇద్దరు టీచర్లపైనా చర్యలు
అనంతపురం: కారణమో తెలీదు కాని ఆమె స్థానంలో భర్త హాజరయ్యారు.
తనూ ఓ పాఠశాలలో టీచర్ అయినప్పటికీ అక్కడ విధులకు డుమ్మా కొట్టి..భార్య 'విధుల'ను నిర్వర్తించారు. ఈ విషయం ఎంఈఓ తనిఖీలో బయటపడడంతో ఆమెను సస్పెండ్ చేయడంతో పాటు అయ్యవారిపైనా చర్యలకు సిఫారసు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
కదిరి పట్టణంలోని మునిసిపల్ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడి గా పనిచేస్తున్నారు. ఆయన భార్య ఓడీచెరువు మండలం టి.కుంట్లపల్లి హరిజనవాడ ప్రాథమిక పాఠశాలలో సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ). ఆమె ఈ నెల 7 నుంచి 9 వరకు సెలవుపై వెళ్లారు. పదో తేదీ (శుక్రవారం) విధులకు హాజరుకావాల్సి ఉండేది.
ఆమె వస్తారనే ఉద్దేశంతో ఆరోజు హెచ్ఎం సెలవు పెట్టారు. కానీ ఆమె స్థానంలో భర్త విధులకు హాజరయ్యారు. ఈ విషయం ఎంఈఓ చెన్నక్రిష్ణ ఆకస్మిక తనిఖీలో బయటపడింది. ఆయన డీఈఓకు నివేదిక పంపడంతో అరుణాదేవిని సస్పెండ్ చేస్తూ ఆదివారం ఉత్తర్వులిచ్చారు. ఆమె భర్తపైనా చర్యలు తీసుకోవాలని కదిరి మునిసిపల్ కార్యాలయానికి సిఫారసు చేశారు.
ఎంత ఇబ్బంది అయినప్పటికీ ఒకరి స్తానం లో మరొకరు విధులు చేయవద్దు....
మరో ఇద్దరిపైనా..
►ఓడీచెరువు మండలం గోళ్లవారిపల్లి ప్రాథమిక పాఠశాలలో ఏకోపాధ్యాయుడిగా ఉన్నారు. ఎలాంటి అనుమతి లేకుండానే గురు, శుక్రవారం పాఠశాలకు డుమ్మా కొట్టారు. దీంతో విద్యార్థులందరూ ఇళ్ల వద్దే ఉండిపోయారు. ఈ విషయంపై గ్రామస్తులు ఫిర్యాదు చేయడంతో ఎంఈఓ పాఠశాలను తనిఖీ చేయగా .. నిజమేనని తేలింది. దీంతో ఎంఈఓ సిఫారసు మేరకు ఎస్జీటీ ని సస్పెండ్ చేస్తూ డీఈఓ ఉత్తర్వులిచ్చారు.
►హిందూపురం మండలం కొట్నూరు ప్రాథమిక పాఠశాల హెచ్ఎం ని కూడా డీఈఓ సస్పెండ్ చేశారు. ఆయన విద్యార్థులకు పాఠాలు సక్రమంగా చెప్పడం లేదని ఎంఈఓ గంగప్ప ఇచ్చిన నివేదిక ఆధారంగా చర్యలు తీసుకున్నారు.
0 Comments:
Post a Comment