వాహనదార్లకు కేంద్రం ఊరాట...కొత్త ఏడాదిలో కొత్త సిరీస్
వాహనదార్లు ఇతర రాష్ట్రాలకు వెళ్లాలంటే ఓ పెద్ద కసరత్తే చేయాలి. ఆ సమస్యకు పరిష్కారం దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
కొత్త వాహనాల కోసం భారత్ సిరీస్(బీహెచ్-సిరీస్) రిజిస్ట్రేషన్ మార్కును ప్రవేశపెట్టింది. బీహెచ్-సిరీస్ మార్కు కింద వాహనాలు రిజిస్టర్ అయితే, ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి వెళ్లేటప్పుడు వారి కారును లేదా బైక్ను మళ్లీ రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఈ సిరీస్ వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం పలు రకాల ప్రయోజనాలను ఆఫర్ చేస్తుంది. బీహెచ్-సిరీస్ రిజిస్ట్రేషన్ మార్కుతో వాహనాలను రిజిస్ట్రేషన్ చేయించుకుంటే, ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి తరలి వెళ్లేటప్పుడు వాహనదారులు మళ్లీ కొత్తగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన అవసరం లేదని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కారీ తెలిపారు. ఎవరైతే తరచూ బదిలీలపై ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి వెళ్తుంటారో, వారికి ప్రస్తుతం ఈ కొత్త బీహెచ్-సిరీస్ నోటిఫికేషన్ అందుబాటులో ఉందని పేర్కొన్నారు.
ఏ వాహనదారులకు ఈ సిరీస్ ప్రయోజనాలు
వాలంటరీ బేసిస్లో బీహెచ్ సిరీస్ రిజిస్ట్రేషన్ అందుబాటులో ఉంటుందని కేంద్ర మంత్రి చెప్పారు. దీని కింద ప్రస్తుతం రక్షణ శాఖ ఉద్యోగులకు, కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రభుత్వ రంగ కంపెనీలో పనిచేసే వారికి, 4 రాష్ట్రాలు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో కార్యాలయాలు కలిగిన ఉన్న ప్రైవేట్ కంపెనీల ఉద్యోగులకు ఈ సిరీస్ను వాలంటరీ బేసిస్లో అందుబాటులో ఉంచినట్టు చెప్పారు.
0 Comments:
Post a Comment