🔳సచివాలయాల కార్యదర్శులకు కొత్త వేతన సవరణ : ప్రభుత్వ కసరత్తు
ప్రారంభమైన ప్రొబేషన్ ప్రకటన ప్రక్రియ
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి-అమరావతి : వార్డు, గ్రామ సచివాలయాల కార్యదర్శులకుకొత్త వేతన సవరణ అమలు కానుంది. ఈ మేరకురాష్ట్ర ప్రభుత్వం విస్తృతంగా కసరత్తు చేస్తోంది. దీనిలో భాగంగా కార్యదర్శులకు ప్రొబేషన్ కూడా ప్రకటించనుంది. ప్రొబేషన్ ప్రకటనకు సంబంధించి జిల్లాల నుండి ప్రభుత్వం నివేదికలు సేకరిస్తోంది. ఇప్పటికే జిల్లాల్లో ప్రొబేషన్ ప్రకటించే అధికారాన్ని కలెక్టర్లకు, మున్సిపల్ పాలన ప్రాంతీయ డైరక్టర్లకు అప్పగించిన సంగతి తెలిసిందే. రెండేళ్లు పూర్తి చేసుకును వారికి ప్రోబేషన్ ప్రకటించాలంటూ ఇచ్చిన ఈ ఆదేశాలకు అనుబంధంగా తాజాగా గ్రామ, వార్డు సచివాలయాల శాఖ అదనపు సర్క్యులర్‌ను జారీ చేసింది. దీనిలో వేతన సవరణ అంశాన్ని ప్రభుత్వం ప్రస్తావించింది. ప్రొబేషన్ ప్రకటిరచే సమయంలోనే సంబంధిత శాఖాధిపతుల నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని, తద్వారా వేతన సవరణ అమలు చేయడానికి సాధ్యమవుతుందని తాజా సర్క్యులర్‌లో పేర్కొన్నారు. ప్రొబేషన్ ప్రకటించిన వారి జాబితాను కూడా శాఖాధిపతులకు పంపించాలని సూచించారు. సిఎస్ అధ్యక్షతన ఏర్పాటైన కార్యదర్శుల కమిటీ కూడా సచివాలయాల కార్యదర్శులకు వేతన సవరణ చేసే అంశాన్ని సిఫార్సు చేసిన నేపథ్యంలోనే తాజా ఆదేశాలు జారీ కావడం విశేషం. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే ప్రొబేషన్ ప్రకటించే ప్రక్రియ ప్రారంభమైంది. విశాఖ జిల్లాలోని కొన్ని మండలాల్లో సంక్షేమ కార్యదర్శులు కొరతమందికి ప్రొబేషన్ ప్రకటించారు. రెండేళ్ల క్రితం ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ ఆరంభంలో సాధారణంగా ఉన్నప్పటికీ, ప్రస్తుతం క్షేత్ర స్థాయి పాలనా యంత్రారగంలో అత్యంత కీలకంగా మారింది. అందుకే ఈ వ్యవస్థలో ఉన్న సచివాలయ కార్యదర్శులకు వేతన సవరణ అమలు చేయాలని నిర్ణయించారు. అయితే ప్రొబేషన్ ప్రకటించినా, వేతన సవరణ అమలులోకి రావడానికి మరికొంత సమయం పడుతుందని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు.
0 Comments:
Post a Comment