లావాదేవీల కోసం తరచూ బ్యాంకులకు వెళ్లే కస్టమర్లకు అలర్ట్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వచ్చే ఏడాది బ్యాంకుల సెలవుల వివరాలను ప్రకటించింది.
హైదరాబాద్ రీజియన్ అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో బ్యాంకులకు ఎన్ని పబ్లిక్ హాలిడేస్ ఉన్నాయో వెల్లడించింది. దేశంలోని అన్ని రీజియన్లలో సెలవుల (Bank Holidays) జాబితాను అధికారిక వెబ్సైట్లో ఆర్బీఐ అప్డేట్ చేసింది. ఈ సెలవుల్లో పండుగలు, పర్వదినాలు ఇతర హాలిడేస్ కలిపే ఉన్నాయి. మరి మీరు తరచూ బ్యాంకులకు వెళ్తూ ఉంటే ఈ సెలవుల వివరాలు తెలుసుకొని మీ బ్యాంకింగ్ లావాదేవీలను ప్లాన్ చేసుకోండి. మరి 2022 లో బ్యాంకులకు ఎన్ని సెలవులు వచ్చాయో, ఏఏ రోజుల్లో బ్యాంకులు తెరుచుకోవో తెలుసుకోండి.
Bank Holidays 2022: బ్యాంకులకు 2022 లో సెలవుల వివరాలు ఇవే
తేదీ | సందర్భం |
జనవరి 15 | మకర సంక్రాంతి |
జనవరి 26 | రిపబ్లిక్ డే |
మార్చి 1 | మహా శివరాత్రి |
మార్చి 18 | హోళీ |
ఏప్రిల్ 1 | బ్యాంక్ అకౌంట్ల క్లోజింగ్ డే |
ఏప్రిల్ 2 | ఉగాది |
ఏప్రిల్ 5 | బాబూ జగ్జీవన్ రామ్ జయంతి |
ఏప్రిల్ 14 | అంబేద్కర్ జయంతి, మహావీర్ జయంతి |
ఏప్రిల్ 15 | గుడ్ ఫ్రైడే |
మే 3 | రంజాన్, బసవ జయంతి, అక్షయ తృతీయ |
ఆగస్ట్ 9 | మొహర్రం |
ఆగస్ట్ 15 | ఇండిపెండెన్స్ డే |
ఆగస్ట్ 20 | శ్రీ కృష్ణ జన్మాష్టమి |
ఆగస్ట్ 31 | వినాయక చవితి |
అక్టోబర్ 5 | దసరా |
అక్టోబర్ 25 | దీపావళి |
నవంబర్ 8 | గురునానక్ జయంతి, కార్తీక పౌర్ణమి |
బ్యాంకులకు 2022 లో మొత్తం 17 సాధారణ సెలవులు వచ్చాయి. ఇవి కాకుండా ప్రతీ ఆదివారం, ప్రతీ నెలలో వచ్చే రెండో శనివారం, నాలుగో శనివారం కూడా బ్యాంకులకు సెలవులు ఉంటాయి. ఈ సెలవులు ప్రతీ నెలలో 6 లేదా 7 ఉంటాయి. కాబట్టి ఈ సెలవుల్ని దృష్టిలో పెట్టుకొని లావాదేవీలు ప్లాన్ చేసుకోవాలి.
బ్యాంకులకు ఎప్పుడెప్పుడు సెలవులు ఉన్నాయో ఆర్బీఐ అధికారిక వెబ్సైట్లో తెలుసుకోవచ్చు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో బ్యాంకు సెలవుల వివరాలు తెలుసుకోవడానికి https://rbi.org.in/Scripts/HolidayMatrixDisplay.aspx లింక్ క్లిక్ చేసిన తర్వాత రీజియన్ ఆఫీస్ హైదరాబాద్ సెలెక్ట్ చేయాలి. ఆ తర్వాత నెల సెలెక్ట్ చేయాలి. ఆ నెలలో బ్యాంకులకు ఎన్ని సెలవులు ఉన్నాయో తెలుస్తుంది.
బ్యాంకులకు సెలవులు ఉన్నప్పుడు కస్టమర్లు నెఫ్ట్, ఐఎంపీఎస్, ఆర్టీజీఎస్, యూపీఐ సేవల్ని ఉపయోగించుకోవచ్చు. కస్టమర్లు ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా లావాదేవీలు జరపొచ్చు. బ్యాంకులకు వెళ్లాల్సిన పని లేకుండా చాలావరకు లావాదేవీలు ఆన్లైన్లోనే పూర్తి చేయొచ్చు. నెఫ్ట్, ఐఎంపీఎస్, ఆర్టీజీఎస్, యూపీఐ, నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ లాంటి సేవల్ని సెలవులతో సంబంధం లేకుండా లభిస్తాయి. కాబట్టి కస్టమర్లు ఈ సేవల్ని ఉపయోగించుకొని లావాదేవీలు జరపొచ్చు.
0 Comments:
Post a Comment