Ap News: ఉచిత పథకాలతో ఏపీలో ఎక్కువగా రెవెన్యూ లోటు: నిర్మలా సీతారామన్
దిల్లీ: ఆంధ్రప్రదేశ్లో 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఎక్కువ రెవెన్యూ లోటు ఉందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఊహించిన దానికంటే ఎక్కవ లోటు ఉందని సీతారామన్ వెల్లడించారు. రాజ్యసభలో భాజపా ఎంపీ జీవీఎల్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ప్రభుత్వం అమలు చేస్తోన్న అమ్మ ఒడి, ఉచిత విద్యుత్ లాంటి ఉచిత పథకాల వల్ల ఏపీలో రెవెన్యూ లోటు ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. ఏపీలో ఆర్థిక క్రమశిక్షణ లోపంతో లోటు పెరిగిందని కాగ్ నివేదిక స్పష్టం చేస్తోందని ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ తెలిపారు.
0 Comments:
Post a Comment