✍నిరుద్యోగులకు శుభవార్త
♦730 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు
🌻అమరావతి, ప్రభన్యూస్: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నవారికి ఏపీపీఎస్సీ తీపికబురు చెప్పింది. రెవెన్యూ, దేవాదాయ శాఖల్లో 730 పోస్టుల భర్తీకి మంగళవారం విడివిడిగా నోటిఫికేషన్లు జారీ చేసింది. ఈ మేరకు రెవెన్యూశాఖలో జూనియర్ అసిస్టెంట్ పోస్టులతో పాటు.. దేవాదా యశాఖలో గ్రేడ్ -3 ఈవో.. పోస్టుల భరీ చేయనున్నది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ విధానం లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. రెవెన్యూ శాఖలో 670 జూని యర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయగా.. దేవదాయ శాఖలో 60 గ్రేడ్ -3 ఈవో పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది. జిల్లాల వారీగా రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్ పోస్టుల వివరాలను పరిశీలిస్తే.. శ్రీకాకుళం-38, విజయనగరం-34, విశాఖ-43, తూర్పు గోదావరి-64, పశ్చిమ గోదావరి - 48, కృష్ణా జిల్లా-50, గుంటూరు-57. ప్రకాశం జిల్లా-56, నెల్లూరు-46. చిత్తూరు 66. అనంతపురం-63, కర్నూలు - 51, కడప-51 గా ఉన్నాయి.
♦దేవాదాయశాఖలో...
ఇక దేవదాయ శాఖలోని ఈవో గ్రేడ్-3 పోస్టుల వివరాలు జిల్లాల వారీగా పరిశీలిస్తే.. శ్రీకాకుళం-4, విజయనగరం-4, విశాఖపట్నం - 4, తూర్పుగోదావరి-8, పశ్చిమ గోదావరి-7. కృష్ణా జిల్లా-6, గుంటూరు-7. ప్రకాశం జిల్లా-6, నెల్లూరు-4, చిత్తూరు జిల్లా-1, అనంతపురం-2, కర్నూలు-6, కడప-1గా ఉన్నాయి. రెవెన్యూ, దేవాదాయ శాఖల్లో పోస్టుల భర్తీకి ఈ నెల 30వ తేదీ నుంచి వచ్చే నెల 18వ తేదీ అర్ధరాత్రి వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్టు. ప్రకటనలో పేర్కొంది.
0 Comments:
Post a Comment