🔳డిఎస్సి-2018లో ఖాళీ పోస్టుల భర్తీ
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : డిఎస్సి-2018 నోటిఫికేషన్లో మిగిలిపోయిన పోస్టులను భర్తీ చేయాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. మెరిట్, రోస్టర్ ప్రకారం డిఎస్సి- 2018లో అర్హత సాధించిన అభ్యర్థులతో భర్తీ చేయాలని జాయింట్ డైరెక్టర్ కె.నాగేశ్వరరావు శుక్రవారం అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ నెల 20న అభ్యర్ధుల లిస్ట్‌ను ప్రకటించాలని, 21వ తేదీన అర్హులను నిర్ధారించాలని తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు 22న సమాచారం అందించాలని పేర్కొన్నారు. 23, 24 తేదీల్లో సర్టిఫికెట్లు అప్లోడ్ చేయాలని వివరించారు. 24 నుంచి 28 వరకు సర్టిఫికెట్ల పరిశీలన నిర్వహించి, 29న ఖాళీలను ప్రదర్శించాలని తెలిపారు. 30, 31 తేదీల్లో కౌన్సెలింగ్ నిర్వహించి పోస్టింగ్ ఉత్తర్వులు ఇవ్వాలని ఆదేశించారు.
0 Comments:
Post a Comment