✍తేలని లెక్కలు!
♦ఉద్యోగులతో 6 గంటల సుదీర్ఘ సమావేశం
♦14.29% ఫిట్మెంట్ ఇస్తామన్న ప్రభుత్వ
♦ఆర్థిక పరిస్థితి అర్థం చేసుకోవాలని వినతి
♦ఒప్పుకొనే ప్రసక్తే లేదన్న సంఘాలు
♦50% ఫిట్మెంట్ కోసం జేఏసీల పట్టు
♦34కి తగ్గొద్దన్న సచివాలయ సంఘం కార్యదర్శుల నివేదికను ఒప్పుకోం
♦పీఆర్సీ నివేదికను బయటపెట్టాలి: సంఘాలు
♦చర్చలు జరుగుతున్నాయి..ఉద్యమం వాయుదా*
*వేయండి: సజ్జల.. కుదరదు: నేతలు
🔺14.29 శాతం ఫిట్‌మెంట్‌కు అంగీకరించాలని ప్రభుత్వం... అసలు సీఎస్ కమిటీ నివేదికనే అంగీకరించబోమని ఉద్యోగ సంఘాలు! వెరసి... పీఆర్సీపై పీటముడి వీడలేదు. ఆరుగంటల చర్చల తర్వాతా స్పష్టత రాలేదు. చర్చలు సహృద్భావ వాతావరణంలో కొనసాగుతున్నందున... నిరసనలు విరమించాలని సర్కారు కోరింది. అందుకు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తిరస్కరించారు. ఈ చర్చలు గురువారం కూడా కొనసాగనున్నాయి.
🌻అమరావతి, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి):
ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, మరికొందరు ఉన్నతాధికారులు ఒకవైపు... ఉద్యోగ సంఘాల నేతలు, ప్రతినిధులు మరోవైపు! పీఆర్సీ, ఇతర డిమాండ్లపై ఆరు గంటలపాటు జరిపిన చర్చలు ఎలాంటి ఫలితంలేకుండానే ముగిశాయి. మంగళవారం సజ్జల జరిపిన భేటీలకు కొనసాగింపుగా... బుధవారం సచివాలయంలో భేటీ నిర్వహించారు. మధ్యాహ్నం 2.15 గంటలకు ప్రారంభమైన సమావేశం రాత్రి 8.20 గంటలకు ముగిసింది. 11వ పీఆర్సీ కమిషన్ నివేదికలోని అంశాలపైనే సమావేశంలో చర్చించాలని అన్ని ఉద్యోగ సంఘాలు పట్టుపట్టాయి. మధ్యలో తెరపైకి వచ్చిన కార్యదర్శుల కమిటీ నివేదికను పరిగణనలోకి తీసుకునేందుకు నిరాకరించాయి.
♦రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని, పరిస్థితిని అర్థం చేసుకుని అధికారుల కమిటీ ఇచ్చిన నివేదికలోని సిఫారసులకు కట్టుబడాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. 14.29 శాతం ఫిట్‌మెంట్‌కు అంగీకరించాలని కోరింది. ఉద్యోగులకు నష్టం వాటిల్లకుండా చూస్తామని హామీ ఇచ్చింది. 14.29 శాతం ఫిట్‌మెంట్‌కు ఉద్యోగ సంఘాలు ససేమిరా అన్నాయి. ఏపీ జేఏసీ అమరావతి, ఏపీ జేఏసీ చైర్మన్లు బొప్పరాజు వెంకటేశ్వర్లు, బండి శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ కనీసం 50 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని కోరారు. సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి 34 శాతానికి తగ్గకుండా ఫిట్మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఫిట్‌మెంట్‌ను కూడా 2018 జులై నుంచి వర్తింప జేయాలని కోరారు. వేతన సవరణ 2022 అక్టోబరు నుంచి వర్తింపజేయాలని సూచించిన అధికారుల కమిటీ సిఫారసులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. 11వ పీఆర్సీ నివేదికను పూర్తిగా బయటపెట్టాలని అన్ని సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు.
♦ఉత్కంఠతో ఎదురు చూపులు
చర్చల ఫలితంపై రాష్ట్రవ్యాప్తంగా 13 లక్షల మంది ఉద్యోగులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూశారు. కానీ... వారు ఆశించింది జరగలేదు. ఫిట్మెంట్ సహా దేనిపైనా ప్రభుత్వం నుంచి స్పష్టత రాలేదు. చివరికి... మరో విడత భేటీ అవుదామని ఉద్యోగ సంఘాల నేతలకు సజ్జల, బుగ్గన చెప్పారు. ‘‘ఈ రోజు అన్ని అంశాలపైనా ప్రభుత్వం సీరియ్‌సగా చర్చించింది. కానీ... ఫలితం మాత్రం శూన్యం’’ అని ఉద్యోగ నేత ఒకరు పెదవి విరిచారు. చర్చలు పద్ధతిగా జరగడంలేదని, చిట్చిట్లా ఉందంటూ ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ సమావేశం మధ్యలో లేచి బయటకు వచ్చారు. కొద్ది సేపటి తర్వాత మళ్లీ సమావేశంలో పాల్గొన్నారు.
♦నల్ల బ్యాడ్జీలతోనే చర్చలకు..
ఏపీ జేఏసీ అమరావతి, ఏపీ జేఏసీ నేతలు సమావేశానికి నల్లబ్యాడ్జీలతోనే హాజరయ్యారు. తాము ఉద్యమ కార్యాచరణ ప్రకటించడంతో, పీఆర్సీతో సహా ఉద్యోగుల అన్ని సమస్యలు పరిష్కారం అయిన తర్వాతే నల్లబ్యాడ్జీలు తీస్తామని జేఏసీల నేతలు స్పష్టం చేశారు.
0 Comments:
Post a Comment