ఈ ఏడాదీ టెన్త్‌లో 7 పేపర్లు
ఏడు పేపర్లతోనే పదో తరగతి పరీక్షలు
ఉత్తర్వులు జారీ ...
వచ్చే ఏడాది జరిగే పదో తరగతి పరీక్షలను ఏడు. పేపర్స్ తోనే నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. 2021 మార్చిలో ఏడు పేపర్లతోనే పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధం కాగా, కోవిడ్ పరిస్థితుల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని వాయిదా వేసింది. 2022 మార్చిలో జరిగే పదో తరగతి పరీక్షల్లో ఈ ఏడాది నిర్ణయించినట్లుగానే ఏడు పేపర్లతోనే నిర్వహిం చనున్నారు. సప్లిమెంటరీ పరీక్షలను కూడా ఏడు పేపర్లతోనే నిర్వహిస్తున్నట్లు ప్ర భుత్వం తెలిపింది. ఇందుకు సంబంధించి ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో పదో తరగతి పరీక్షలను 11 పేపర్ల తో నిర్వహించేవారు. గత ఏడాది కోవిడ్-19 పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని పరీక్షలు నిర్వహించ లేదు. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని 2021 మార్చిలో నిర్వహించే పదో తరగతి పరీక్షలను ఏడు పేపర్లతోనే నిర్వహించాలని నిర్ణయించి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. కోవిడ్ తీవ్రత, విద్యార్థుల తల్లిదండ్రుల అభ్యర్ధనల నేపధ్యంలో పరీక్షలను నిర్వహించ లేదు. వీటిని దృష్టిలో ఉంచుకొని 2022 మార్చిలో నిర్వహించనున్న పదో తరగతి పరీక్షలను ఏడు పేపర్లతోనే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించి ఉత్తర్వులు జారీ చేసింది.
0 Comments:
Post a Comment